TG: కొమురవెల్లి మ‌ల్లన్న జాతర కోసం ఎదురుచూస్తున్నారా?

by Gantepaka Srikanth |

కొమురవెల్లి మల్లన్న జాతర(Komuravelli Mallanna Jatara 2025) సమీపిస్తోన్న నేపథ్యంలో అధికారులతో మంత్రి కొండా సురేఖ(Konda Surekha) సమీక్షా సమావేశం నిర్వహించారు.

TG: కొమురవెల్లి మ‌ల్లన్న జాతర కోసం ఎదురుచూస్తున్నారా?
X

దిశ, వెబ్‌డెస్క్: కొమురవెల్లి మల్లన్న జాతర(Komuravelli Mallanna Jatara 2025) సమీపిస్తోన్న నేపథ్యంలో అధికారులతో మంత్రి కొండా సురేఖ(Konda Surekha) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు. కొమురవెల్లి మ‌ల్లన్న కల్యాణం, జాతరను ఘ‌నంగా నిర్వహించాలని చెప్పారు. డిసెంబర్ 14 ఉదయం 10.45 గంటలకు శ్రీమల్లికార్జున స్వామి వారి కల్యాణం, 18 జనవరి 2026 నుండి 10 (ఆది)వారాలపాటు, 16 మార్చి 2025 వరకు జాతర నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాల‌ని మంత్రి సురేఖ దిశానిర్ధేశం చేశారు. దేవాదాయ శాఖ, ఇత‌ర నిధులతో ఆలయ ప్రగతికి చేపడుతున్న పనులపై మంత్రి సురేఖ ఆరా తీశారు. సచివాలయంలోని దేవాదాయ మంత్రి శాఖ ఛాంబర్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో సిద్దిపేట జిల్లా అధికారులతో మంత్రి కొండా సురేఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రివ్యూ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, ఎండోమెంటు ప్రిన్సపల్ సెక్రటరీ, శైల‌జా రామ‌య్య‌ర్‌, కమిషనర్​హ‌రీష్‌ పాల్గొన్నారు.

Next Story