- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Komatireddy: ఏం మొహం పెట్టుకుని నల్గొండకు వచ్చినవ్.. కేటీఆర్‌పై మంత్రి కోమటి రెడ్డి హాట్ కామెంట్స్
పదేళ్లు అధికారంలో ఉండి అభివృద్ధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా (Nalgonda District)ను పడావు పెట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మళ్లీ ఏం మొహం పెటుకుని నల్గొండ (Nalgonda)కు వచ్చాడంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) ఫైర్ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: పదేళ్లు అధికారంలో ఉండి అభివృద్ధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా (Nalgonda District)ను పడావు పెట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మళ్లీ ఏం మొహం పెటుకుని నల్గొండ (Nalgonda)కు వచ్చాడంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ (BRS) రైతు మహా ధర్నాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ కాంగ్రెస్ పార్టీ (Congress Party) సమావేశాల్లో పల్లీలు, ఐస్‌క్రీమ్‌లు అమ్ముకునే అంత జనం కూడా కేటీఆర్ రైతు మహా ధర్నా (Rathu Maha Dharna)కు హాజరు కాలేదని సెటైర్లు వేశారు. నల్గొండ (Nalgonda), భువనగిరి (Bhongir) ఉమ్మడి జిల్లాలో తాను ఎక్కడ నిలబడినా గంటలో 5 వేల మంది గుమిగూడుతారని కామెంట్ చేశారు. జిల్లాలో ఫ్లోరైడ్ మహమ్మారిని పెంచి పోషించింది ఇదే బీఆర్ఎస్ పార్టీ (BRS Party) కాదా అని ఆక్షేపించారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) 11 సీట్లలో విజయం సాధించిందని, ఆ దెబ్బతో ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) పట్ల ఉన్న వ్యతిరేకత బయటకు వచ్చిందని అన్నారు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లాలో ఒకే ఒక్క సీటుకు పరిమితమైందని ఎద్దేవా చేశారు. సౌతిండియా (South India)లోనే నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి (Kunduru Raghuveer Reddy) దాదాపు 6 లక్షలకు పైగా రికార్డు మెజారిటీ సాధించారని గుర్తు చేశారు. కింద ఉన్న గంధమల్ల (Gandhamalla), బస్వాపూర్ (Baswapur) ప్రాజెక్టులను పడావు పెట్టి.. పైన కొండ పోచమ్మ (Konda Pochamma), మల్లన్న సాగర్ (Mallanna Sagar) ప్రాజెక్టులను కట్టి కిందకు కాలువను కూడా వదలని మానవత్వం లేని మనిషి రూపంలో ఉన్న మృగాలు బీఆర్ఎస్ (BRS) నాయకులని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ (BRS) రైతు మహా ధర్నా ఓ డ్రామా అని.. ఆ పార్టీని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.






