- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మీ మీద నాకు అపారమైన నమ్మకం ఉంది’.. తెలంగాణ కొత్త మంత్రికి కోమటిరెడ్డి విషెస్
ఇటీవల తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాకిటి శ్రీహరి తన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy)ని కలిశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాకిటి శ్రీహరి తన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy)ని కలిశారు. ఈ సందర్భంగా శ్రీహరికి కోమటిరెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల సమస్యలపై ఎనలేని అనుభవం కలిగిన నేతగా ఆయన సేవలు రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడతాయని.. ఆ నమ్మకం తనకు ఉందని అన్నారు. నూతన బాధ్యతల్లో ఆయనకు అన్ని విధాలా విజయాలు కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అంతకుముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)తో ప్రజా భవన్‌లో వాకిటి శ్రీహరి (Vakiti Srihari), అడ్లూరి లక్ష్మణ్, రామచంద్రు నాయక్ (Ramachandra Nayak) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం సమిష్టిగా పనిచేయాలని ఆకాంక్షించారు. అలాగే ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Health Minister Damodar Rajanarsimha)ని తన నివాసంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు అడ్లూరిని మంత్రి దామోదర అభినందించి, ఆశీర్వదించారు.
ఇటీవల తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ వాకిటి శ్రీహరి గారు తన కుటుంబ సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా నన్ను కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు.
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) June 10, 2025
ఈ సందర్భంగా మంత్రివర్యుడికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశాను.
ప్రజల సమస్యలపై ఎనలేని అనుభవం కలిగిన నేతగా ఆయన సేవలు… pic.twitter.com/sT0vCL75oj






