నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్ట్ సీఎం అవుతా: రాజగోపాల్ రెడ్డి మరో సంచలనం

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-13 16:53:37  IST  )

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయంత్రం మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మాట్లాడుతూ మంత్రి పదవిపై హాట్ కామెంట్స్ చేశారు.

నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్ట్ సీఎం అవుతా: రాజగోపాల్ రెడ్డి  మరో సంచలనం
X

దిశ,చౌటుప్పల్: రాబోయే రోజుల్లో తనకు మంత్రి పదవి వస్తుందని మంత్రి కాకపోతే ముఖ్యమంత్రి అవుతానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్ చేశారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన కౌన్సిలర్ అభ్యర్థులతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మునుగోడు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తనకు అడుక్కోవడం రాదని మర్యాదగా ఇచ్చిన మాటకు కట్టుబడి మంత్రి పదవి ఇవ్వండని లేదంటే లాక్కునేదాకా చూసుకోవద్దంటూ ఘాటుగానే హెచ్చరించారు.

తనకు ఇచ్చిన మాట ప్రకారం చేయండి లేదంటే డైరెక్ట్ నా టార్గెట్ అదే అంటూ ముఖ్యమంత్రి పదవిని ఉద్దేశించి అన్నారు. ఇకనుండి మునుగోడు నియోజకవర్గంను(ప్రజలు) చూసుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని నేను చూసుకుంటానని ఎమ్మెల్యే అన్నారు. సమయం వచ్చినప్పుడు తెలంగాణలో ఇక జెండా ఎగరవేద్దామంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆయన వెంట మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమన్వయకర్త పబ్బు రాజు గౌడ్, గెలుపొందిన నూతన కౌన్సిలర్లు ఉన్నారు.




Next Story