‘ఇక ప్రభుత్వాన్ని స్తంభింపజేయాల్సిందే’.. MLA కోమటిరెడ్డి సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |

రాష్ట్ర ప్రభుత్వం(Congress Govt)పై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘ఇక ప్రభుత్వాన్ని స్తంభింపజేయాల్సిందే’.. MLA కోమటిరెడ్డి సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం(Congress Govt)పై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సంస్థాన్ నారాయణపురం భూనిర్వాసితులతో కోమటిరెడ్డి సమావేశం అయ్యారు. రీజనల్ రింగ్ రోడ్(Regional Ring Road) అలైన్‌మెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణభాగం అలైన్‌మెంట్ మారాలంటే ఉత్తరభాగం మారాలి.. ఉత్తరభాగం అలైన్‌మెంట్ మారాలంటే ప్రభుత్వమే మారాలేమో అని షాకింగ్ కామెంట్స్ చేశారు. చౌటుప్పల్ డివిజన్‌లోని ఆర్ఆర్ఆర్ నిర్వాసితులు తొక్కని గడపలేదని అన్నారు. తాను ఢిల్లీలో పెద్దలను కలిసినా న్యాయం జరుగలేదని చెప్పారు. ట్రిపులార్ రైతుల కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని కీలక ప్రకటన చేశారు. ‘గత ప్రభుత్వం మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వనందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను. నా రాజీనామాతోనే నియోజకవర్గం అభివృద్ధికి నిధులు వచ్చాయి. ప్రస్తుతం ప్రభుత్వం కూడా నాకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చింది. పదవిపై నాకేం ఆశ, వ్యామోహం రెండూ లేవు.. కానీ నా నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం సహించను. ఎంతవరకైనా వెళ్తాను. ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే.. ఆ పని చేయడానికి కూడా నేను వెనుకాడను’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Next Story