Komatireddy: కేసీఆర్ అసెంబ్లీకి వస్తేనే మజా.. అప్పుడే కిక్కుంటది

by Gantepaka Srikanth |
Komatireddy: కేసీఆర్ అసెంబ్లీకి వస్తేనే మజా.. అప్పుడే కిక్కుంటది
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే కిక్కు లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సభకు వస్తేనే మజా ఉంటదని అభిప్రాయపడ్డారు. ఎల్‌వోపీగా కేసీఆర్ సభకు రాకపోవడంతో బీఆర్ఎస్ నేతలు తల్లి లేని పిల్లలుగా మారిపోయారని విమర్శించారు. హరీష్ రావు వర్కర్.. కానీ ఆయనకు ఎల్‌వోపీ ఇవ్వరు అని ఎద్దేవా చేశారు. హరీష్ రావు, కేటీఆర్‌లలో ఎవరికి పగ్గాలు ఇచ్చినా పార్టీ ఆగమవుతుందని అన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. ఎంత దోపిడీ చేయాలో అంత దోపిడీ చేశారని ఆరోపించారు. తప్పులు ఎక్కడ బయటపడతాయో అని అసెంబ్లీలో గందరగోళం క్రియేట్ చేస్తున్నారని అన్నారు.

Advertisement

Next Story