Komatireddy: పార్టీ మారుతున్నట్లు నాపై దుష్ప్రచారం.. కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని, కొత్త పార్టీ, కాంగ్రెస్ పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Komatireddy: పార్టీ మారుతున్నట్లు నాపై దుష్ప్రచారం.. కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) ప్రభుత్వం తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని, కొత్త పార్టీ, కాంగ్రెస్ పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు నేను ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి వ్యతిరేకమంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని అన్నారు. కొందరు సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఒక (Congress) కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా.. రెండుసార్లు పార్టీ తరఫున గెలిచాను.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ అంటే చాలా అభిమానం.. మా కుటుంబమే కాంగ్రెస్ పార్టీ కుటుంబం అని చెప్పుకొచ్చారు. అలాంటి నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు, కొత్త పార్టీ పెడుతున్నట్లు, పార్టీ మారుతున్నట్లు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కొందరు గిట్టని వ్యక్తులు నా ప్రతిష్ట దెబ్బతీసేందుకు అవాస్తవాలు సోషల్ మీడియా, బయట ప్రచారం చేస్తున్నారని ఇవన్నీ నమ్మవద్దని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Next Story