Komatireddy: మాటిచ్చినప్పుడు ఆ సంగతి తెల్వదా?.. మంత్రి పదవిపై మరోసారి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2025-08-12 07:20:22  IST  )

మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రోజు రోజుకు డోస్ పెంచుతున్నారు.

Komatireddy: మాటిచ్చినప్పుడు ఆ సంగతి  తెల్వదా?.. మంత్రి పదవిపై మరోసారి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajgopal Reddy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే రాజగోపాల్ రెడ్డికి అన్యాయం జరిగినట్టేనని అన్నారు. నాకు అన్యాయం జరిగితే పర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దన్నారు. గత ప్రభుత్వానికి ఇదే చెప్పానని ఇప్పుడు కూడా చెప్తున్నానన్నారు. ఇవాళ మునుగోడు మండలం ఎలగలగూడెంలో రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్సీ నెలికంటి సత్యంతో కలిసి ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంత్రి పదవి (minister post dispute) ఇస్తానని నాకు పార్టీ మాటిచ్చిందని నాకు మంత్రి పదవి ఇచ్చినప్పుడే ఇవ్వండి కానీ అప్పటివరకు మాత్రం మునుగోడు అభివృద్ధికి సహకరించి ఒక్క రూపాయి కూడా ఆపొద్దన్నారు. మంత్రి పదవి ఇవ్వడానికి సమీకరణాలు కుదరటం లేదని అంటున్నారు. సమీకరణలు ఎందుకు కుదరటం లేదు? నాకు మంత్రి పదవి రాకుండా ఎవరు అడ్డుకుంటున్నారు? అని ప్రశ్నించారు.

పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా?

నన్ను పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా మేము ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామని అని రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండవసారి ప్రామిస్ చేసినప్పుడు తెలియదా మేమిద్దరం అన్నదమ్ములం ఉన్నామని అని నిలదీశారు. ఒడ్డు దాటే వరకు ఓడ మల్లయ్య ఒడ్డు దాటాక బోడి మల్లయ్య అన్న చందంగా ఉందని 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకి ముగ్గురు మంత్రులు (Khammam ministers) ఉన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ (Nalgonda ministers) జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండడం తప్పా అని అన్నారు. ఇద్దరం అన్నదమ్ముల్లో ఇద్దరం సమర్థులమే, ఇద్దరం గట్టి వాళ్లమే ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటన్నారు.

ఓపిక పడుతున్న..

ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్నాని ఈ ప్రాంతానికి అన్యాయం చేయొద్దు మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్నారు. భువనగిరి పార్లమెంటు నుండి ఎంపీగా, నల్గొండ జిల్లాకు ఎమ్మెల్సీగా పని చేశాను. నల్గొండ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలలో మునుగోడు నియోజకవర్గం వెనుకబడి ఉంది. ప్రభుత్వ ఆసుపత్రి పోతే పేదోడికి న్యాయం జరగాలి. ప్రైవేటు ఆసుపత్రులు ప్రైవేటు పాఠశాలలు పేదవాడి రక్తం తాగుతున్నాయి. పేదవారికి అండగా ఉండాలని నేను కష్టపడుతున్నానని ఆ భగవంతుడు ఏ పదవి ఇచ్చినా మునుగోడు ప్రజల కోసమే కానీ నా కోసం కాదన్నారు.

Also Read..

మంత్రి పదవి పై ఉన్న ధ్యాస అభివృద్ధి పైన పెట్టాలి

Next Story