ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

by Gantepaka Srikanth |

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రీజనల్ రింగ్ రోడ్డు(Regional Ring Road) రైతుల కోసం ఎంత దూరమైనా వెళ్తా అని ప్రకటన చేశారు. రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తా అని అన్నారు. ఆర్ఆర్ఆర్ విషయంలో గత ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పారు. కాగా, అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆమోదం తెలపడంతో.. అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తొలి రోజు అసెంబ్లీ సమావేశం పూర్తయ్యాక మంత్రివర్గం భేటీ కానుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌పై జీఓ జారీ విషయమై.. కేబినెట్‌ సమావేశంలో చర్చించనున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై అసెంబ్లీలోనే చర్చకు పెడతామని, అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశమిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంతకుముందే ప్రకటించారు. ఇటీవల హైకోర్టుకు కూడా ప్రభుత్వం ఇదే విషయాన్ని నివేదించింది. అసెంబ్లీలో చర్చించిన తర్వాత.. తదుపరి ఏం చేయాలో నిర్ణయిస్తామని తెలిపింది. ఈ అంశంపై ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చ చేపట్టే అవకాశం ఉంది.

Next Story