- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Komatireddy: ముందుంది ముసళ్ల పండగ.. బీఆర్ఎస్‌కు రాజగోపాల్ రెడ్డి వార్నింగ్
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీరియస్ అయ్యారు. శనివారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. తాము ఇంకా ఏం చేయకముందే బీఆర్ఎస్ నేతలు గగ్గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ముందుంది ముసళ్ల పండగ అని గుర్తుపెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. పదేళ్ల పాటు చేసిన అవినీతిపై చర్యలు తీసుకుంటే బీఆర్ఎస్ పరిస్థితి ఏమవుతుందో మరి అని సెటైర్ వేశారు. గులాబీ నేతలను తలుచుకుంటుంటే బాధగా ఉందని ఎద్దేవా చేశారు. కాగా, అంతకుముందు అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడించింది. హాఫ్ నాలెడ్జ్‌తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నాడని హరీష్ రావు అంటే.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఆకారం పెరిగింది తెలివి పెరగలేదంటూ హరీష్ రావుపై విరుచుకుపడ్డారు.