- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Rajagopal Reddy : అయ్యేది ఉంటే సీఎం కావొచ్చు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మొదటి రోజు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిల మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వారితో మాట్లాడుతూ.. గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయిందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ మంత్రి జైలు పోయే లిస్టులో మొదటి వ్యక్తి అని కోమటిరెడ్డి వారితో అన్నారు.
ప్రశాంత్ రెడ్డి లాంటి వారిని తాము కొనలేమని.. కానీ కేసీఆర్ మాత్రం రూ.20, 30 కోట్లు ఇచ్చి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నారన్నారు. తాము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రూ.5, 10కి మాత్రమే అడుగుతున్నామన్నారు. అందుకే ఇంకా 26 ఎమ్మెల్యేలు తమ దగ్గరికి రాలేదన్నారు. రూ.300 కోట్లు ఖర్చు పెట్టి మునుగోడు ఉపఎన్నికలో గెలిచారని.. కర్ణుడిని ఒడించినట్లు ఓడించారని కోమటిరెడ్డి అన్నారు. మునుగోడు ఉపఎన్నిక ఎఫెక్ట్ బీఆర్ఎస్‌పై పడిందన్నారు. అందుకే కేసీఆర్ అధికారం కోల్పోయారన్నారు. తాను మంత్రి పదవి కోసం పైరవీలు చేయనని.. అయ్యేది ఉంటే సీఎం కావొచ్చని కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.