- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కామారెడ్డి సమగ్ర అభివృద్ధికి పటిష్ట చర్యలు: మంత్రి కోమటిరెడ్డి
కామారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ

దిశ, నిజాంసాగర్: కామారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సోమవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో విద్యుత్ సరఫరా నిరవధికంగా కొనసాగేందుకు అదనపు సబ్‌స్టేషన్ల నిర్మాణానికి అనువైన భూములపై ప్రతిపాదనలు సమర్పించాలని, ఉప ముఖ్యమంత్రితో చర్చించి త్వరితగతిన మంజూరుచేయిస్తానని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కాల్వల పనులు, భూ సేకరణ, పరిపాలన అనుమతులపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
ఇక జిల్లాలో 100 పడకల ఆసుపత్రి, హైవే సమీపంలో ట్రామా సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. లాభసాటి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని, సేంద్రియ సాగుపై ప్రోత్సాహం అందించాలన్నారు. మిషన్ భగీరథలో అదనపు పైప్‌లైన్, బోర్ల సర్వే చేపట్టాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సూచించారు.
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, మంత్రి సూచనల మేరకు వైద్య, నీటి సరఫరా, మహిళా శక్తి మండలాల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.






