అది పెద్ద జోక్.. కవిత పార్టీపై కోమటిరెడ్డి సెటైర్లు

by Ajay Maddhiboyina |   (  Updated:2026-04-30 13:22:19  IST  )

న‌ల్గొండ జిల్లా కొండ‌మ‌ల్లెప‌ల్లి మండ‌లంలో యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణ‌ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

అది పెద్ద జోక్.. కవిత పార్టీపై కోమటిరెడ్డి సెటైర్లు
X

దిశ, వెబ్ డెస్క్: నల్గొండ జిల్లా కొండ‌మ‌ల్లెప‌ల్లి మండ‌లంలో యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణ‌ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణ మాదిరిగా యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మించ‌లేద‌ని అన్నారు. 2500 మంది విద్యార్థుల కోసం 200 కోట్ల‌తో 25 ఎక‌రాల్లో వంద స్కూళ్లు క‌ట్టిస్తున్నామ‌ని చెప్పారు. ఈ స్కూళ్లు క‌ట్ట‌డం ద్వారా రేవంత్ రెడ్డి చ‌రిత్ర సృష్టించార‌ని చెప్పారు. బీఆర్ఎస్ వి డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ అని వ్యాఖ్యానించారు. క‌విత ఆస్తుల పంప‌కాల గురించి ర‌చ్చ చేస్తోంద‌ని వాటిని డైవ‌ర్ట్ చేసేందుకే కేసీఆర్ స‌భ‌లు పెడుతున్నార‌ని విమ‌ర్శించారు. కొట్లాట‌లు బ‌య‌ట‌కు రావొద్ద‌నే స‌భ‌లు పెడుతున్నార‌ని అన్నారు.

క‌విత ముఖ్య‌మంత్రి కావ‌డం పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. క‌విత ఇప్పుడు ముఖ్య‌మంత్రి అయితే తాను ఎప్పుడో ముఖ్య‌మంత్రి కావాల్సి ఉంద‌న్నారు. ఆరుసార్లు గెలిచాన‌ని యూత్ కాంగ్రెస్ నుండి ప్రారంభించి ఈ స్థాయికి వ‌చ్చాన‌ని చెప్పారు. తాము అభివృద్ధి కోసం సీరియ‌స్ గా ప‌నిచేస్తున్నామని వాళ్ల‌ను ప‌ట్టించుకోవ‌డంలేద‌ని అన్నారు. స‌భ‌ల‌కు ప్ర‌జ‌లు రావ‌డం వేరు ఓట్లు వేయ‌డం వేరు అని అన్నారు. డ‌బుల్ బెడ్రూంలు, ఎస్టీల‌కు రిజ‌ర్వేష‌న్లు అంటూ అన్ని వ‌ర్గాల‌ను మోసం చేశార‌న్నారు. కేసీఆర్ క‌ట్టిన గురుకులాల్లో స‌రైన వ‌స‌తుల్లేక విద్యార్థులు ఇబ్బంది ప‌డ్డార‌ని విమ‌ర్శించారు. అప్పులు చేసి ఆగం చేశార‌ని అభివృద్ధి చేయ‌లేద‌న్నారు. ధాన్యం కొనుగోళ్ల‌లో ఆల‌స్యం లేకుండా ఉండేందుకు అధికారులు, నాయ‌కులు రాత్రింభ‌వళ్లు ప‌నిచేస్తున్నామ‌ని తెలిపారు. తాము చేసే పనులతో వద్దన్నా మరో పదేళ్లు తామే అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు.

Next Story