- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరికీ మంత్రి పదవి.. జగ్గారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
మంత్రి పదవులపై జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరికీ కేబినెట్‌లో చోటుండాలన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో/ సంగారెడ్డి బ్యూరో: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి (Komatireddy Rajgopal Reddy) మంత్రి పదవిపై జోరుగా చర్చ జరుగుతున్న వేళ కోమటిరెడ్డి బ్రదర్స్ కు మంత్రి పదవిపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి (Jagga Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని (Komatireddy Venkat Reddy) మంత్రివర్గంలో కంటిన్యు చేస్తూనే రాజగోపాల్ రెడ్డికి కూడా కేబినెట్‍లోకి తీసుకోవాలన్నారు. కేబినెట్‍లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. సీఎంకి కూడా ఇదే చెప్తానన్నారు. ఇవాళ గాంధీ భవన్‍లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. పలు కీలక అంశాలపై స్పందించారు. డబ్బులు లేకుండా రాజకీయం లేదని ఎవరు డబ్బు పెడితే వాళ్ళు నాయకుడు అవుతున్నారన్నారు. MLA గెలవాలి అంటే వంద కోట్లు అవుతున్నాయని చెప్పారు.
రెడ్ల సపోర్ట్ తో పీసీసీ చీఫ్ అయ్యారు:
పీసీసీ అధ్యక్షుడిగా తనను నియమించాలంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి స్పందించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్లోలో పీసీసీ చీఫ్ జగ్గారెడ్డి అని అన్నారనని అది కూడా మూడేళ్ల కో నాలుగేండ్లకో అన్నట్టు వెంకన్న అన్నాడని చెప్పారు. ఇప్పుడు చర్చ అది కాదన్నారు. మహేశ్ కుమార్ గౌడ్ కంటిన్యు కూడా కావచ్చని దీని మీద ఒకరిద్దరు బీసీ బ్రదర్స్ మాట్లాడారు. ఊర్లో రెడ్డి, బీసీలు కలిసి ఉంటామని కలిసి పని చేస్తామన్నారు. PCC చీఫ్‍గా మహేశ్ కుమార్ గౌడ్ పేరు ప్రతిపాదించిందే నేను అని రెడ్లు అంతా సపోర్ట్ చేస్తేనే మహేశ్ గౌడ్ PCC అయ్యారన్నారు. మేమంతా ఫ్రెండ్లీగా ఉన్నామని ఎవరూ మా ఫ్రెండ్షిప్‍ను ఖరాబు చేయవద్దన్నారు. BRS అధికారంలో ఉన్నప్పుడు సీఎం ఓసీ, ఆ పార్టీ అధ్యక్షుడు ఓసీ కానీ అప్పుడు ఎవరూ ఎందుకు అడగలేదని నిలదీశారు. పదేండ్లు ఎవరైనా దళితున్ని సీఎం ఎందుకు చేయలేదు అని అడిగారా? అప్పుడు కేసీఆర్‍కు మీడియా భయపడిందన్నారు.
బండి సంజయ్ మాటలకు విలువ లేదు:
మున్సిపల్ ఎన్నికల కారణంగా తాను సంగారెడ్డికే పరిమితం అయ్యానని పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తల కోసం పని చేశానన్నారు. తాను గాంధీ భవన్ రాక 104 రోజులైందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిని సంగారెడ్డికి ఆహ్వానించానన్నారు. అభివృద్ధి పనులపై నివేదిక ఇచ్చాం. ఈ నెల 30 లేదంటే మే లో సంగారెడ్డికి సీఎం రేవంత్ వస్తారన్నారు. నియోజక వర్గాల విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలు నష్టపోతాయన్నారు. దక్షిణాదికి రాజకీయ ఉనికి లేకుండా కుట్ర జరుగుతుందని బీజేపీ మంత్రులు ఏం చేయలేరు ? మాట్లాడలేరన్నారు. కాంగ్రెస్‍లో అయితే సోనియా గాంధీకి చెప్పుకునే స్వాతంత్య్రం ఉండేది, కానీ బీజేపీలో అలాంటి అవకాశమే ఉండదన్నారు. బండి సంజయ్ ఏం మాట్లాడిన విలువ ఉండని ఆయన విమర్శలు అంత సీరియస్‍గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
పొంగులేటికి క్లీన్ చిట్:
అధికార పార్టీ మీద ప్రతిపక్షం ఆరోపణలు చేయడం సహజం అని ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు చెప్పడం సహజం అన్నారు. రెండున్నర యేండ్లలో సంగారెడ్డి జిల్లాలో ఎక్కడైనా భూమి నేను తీసుకున్నట్టు, ఇన్వాల్వ్ అయినట్టు మీకు సమాచారం ఉందా? అని పొంగులేటి నన్ను అడిగారు. నా జిల్లాలో ఎలాంటి ఆరోపణలు లేవని సర్టిఫికెట్ ఇచ్చాను. నాకు ఎదుటి వాళ్ళ మీద ఆరోపణలు చేసే అలవాటు లేదు. ఒక్కో ఎకరం కొల్లూరు.. ఉస్మాన్ పూర్ పోతే ఎకరానికి 20 కోట్లు. ఎవరు వేలు పెట్టినా భగ్గుమంటదన్నారు. నా జిల్లాలో భూమి ముట్టుకోవడానికి నాకే వీలు లేకుండా పోతుంది.. ఇంకా పొంగులేటికి ఎక్కడ దొరుకుతుందన్నారు. మరోసారి హరీశ్ రావు ఆరోపణలు చేస్తే వాళ్ళు ఏం చేశారో బయట పెడతానన్నారు. పటాన్‍చెరులో ఎవరు దందా చేశారో చెప్తానన్నారు. 2014 నుండి మూడేళ్లు జగ్గారెడ్డి ఎక్కడైనా భూములు సంపాదించాడా అని వెతికారని జల్లెడ పట్టినా ఏం దొరకలేదన్నారు.
మీ నాయకులకు ట్రైనింగ్ ఇవ్వండి కేసీఆర్..
సీతక్క సెల్ ఫోన్ ల అవినీతి జరిగింది అని అంటున్నారని BRS నాయకులకు కామన్ సెన్స్ లేదన్నారు. మీ నాయకులకు ట్రైనింగ్ ఇవ్వండి కేసీఆర్.. నా అద్దాలు వెయ్యి రూపాయలు.. షాప్‍కి పోతే 10 వేలు. నా వాచ్ వెయ్యి..షోరూం పోతే 10 వేలు. గింత కామన్ సెన్స్ కూడా బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. టెండర్ లేకుండా ఫోన్ కొంటారా..? వారివి విలువ లేని ఆరోపణలన్నారు. ఏం దొరకుతలేదు అని...ఏదో ఒకటి వేయాలని ఆరోపణలు చేస్తున్నారని పైసా కి పనికి రాని వాడు కూడా ఆరోపణలు చేస్తారని ఏం చేస్తాం..ప్రతి దానికి ఎక్కడ సమాధానం చెప్తామన్నారు. సోషల్ మీడియాను బ్యాన్ చేసి పడేయాలని ప్రతీ దాన్ని ఇష్యూ చేస్తున్నారని అన్నారు. రీల్స్ చేసే వాడు వంద మందిని ముద్దు పెట్టుకున్న ఏం కాదు. కానీ నా లాంటి వాడు ముద్దు పెడితే తిప్పి తిప్పి వేస్తారన్నారు.






