Komatireddy: బండి సంజయ్..! తెలంగాణ ఉద్యమంలో నువ్వెక్కడున్నవ్: మంత్రి కోమటిరెడ్డి ఫైర్

by Kema Shiva Kumar |   (  Updated:2025-01-29 06:57:24  IST  )

పద్మ అవార్డులు (Padma Awards) తెలంగాణ పాలిటిక్స్‌ (Telangana Politics)లో కాక రేపుతున్నాయి.

Komatireddy: బండి సంజయ్..! తెలంగాణ ఉద్యమంలో నువ్వెక్కడున్నవ్: మంత్రి కోమటిరెడ్డి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: పద్మ అవార్డులు (Padma Awards) తెలంగాణ పాలిటిక్స్‌ (Telangana Politics)లో కాక రేపుతున్నాయి. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పద్మ అవార్డుల విషయంలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందంటూ బహిరంగంగా విమర్శలు గుప్పించారు. ఆ వ్యాఖ్యలకు కౌంటర్‌గా కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) ప్రజా గాయకుడు గద్దర్‌ (Gaddar)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గద్దర్‌(Gaddar)కు పద్మ అవార్డు ఇవ్వాలన్న ప్రభుత్వ డిమాండ్‌ను బండి సంజయ్ (Bandi Sanjay) కొట్టి పడేశాడు. తెలంగాణ (Telangana) రాష్ట్ర పౌరులతో పాటు పోలీసులు, అమాయకులను కాల్చి చంపిన మవోయిస్టు (Maoist) నేతలకు దన్నుగా ఉన్న గద్దర్‌కు అవార్డు ఎలా ఇస్తారని కామెంట్ చేశారు. గద్దర్ తెలంగాణ (Telangana) కోసం ఏ మేలు చేయలేదని.. ఓ వర్గానికి చెందిన వారిని రెచ్చగొట్టేలా పాటలు పాడాడని అలాంటి వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో పద్మ అవార్డ్ ఇవ్వబోమని బండి సంజయ్ (Bandi Sanjay) తేల్చి చెప్పారు.

తాజాగా, కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి (Komatireddy Venkat Reddy) ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో తన కాలికి గజ్జె కట్టి ఊరూరు తిరిగి ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను గద్దర్, ప్రజలకు చాటి చెప్పి వారిలో చైత్యన్యాన్ని నింపారని గుర్తు చేశారు. చనిపోయే వరకు ప్రజా సమస్యలపైనే పోరాటం చేసిన వ్యక్తి చనిపోతే కనీసం ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) నివాళులు కూడా అర్పించకపోవడం బాధకరమని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాల్గొన్న నాడు.. ఇదే బండి సంజయ్ ఎక్కడున్నాడని ధ్వజమెత్తారు. భాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉండి ఓ మహోన్నత వ్యక్తిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని మంత్రి కోమటి రెడ్డి ఫైర్ అయ్యారు.

గద్దర్ ఓ నర హంతకుడు: విష్ణువర్ధన్ రెడ్డి

గద్దర్‌ (Gaddar)కు ఎల్టీటీఈ (LTTE) తీవ్రవాదికి పెద్దగా తేడా ఏమి లేదని బీజేపీ (BJP) నేత విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvardhan Reddy) మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. గద్దర్‌ (Gaddar)కు ఎల్టీటీఈ (LTTE) తీవ్రవాదికి పెద్దగా తేడా ఏమి లేదని అన్నారు. అనేక మంది ప్రాణాలు తీసిన నరహంతకుడు గద్దర్ (Gaddar) అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత ప్రజాస్వామ్య విధానాలకు గద్దర్ బద్ద వ్యతిరేకి అని ఫైర్ అయ్యారు. నిషేధిత మావోయిస్టు సంస్థలో ఉన్న గద్దర్‌కు అవార్డు ఎలా ఇవ్వాలని ప్రశ్నించారు. ఎల్టీటీఈ (LTTE)కి కూడా పద్మ అవార్డులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అంటారా అని ఆక్షేపించారు. లేక ఆయన కుమార్తె కాంగ్రెస్‌లో ఉన్నారని పురస్కారం ఇవ్వాలా అని సెటైర్లు వేశారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో గద్దర్‌పై అనేక కేసులు ఉన్నాయని విష్ణువర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు.

Next Story