నాకు అదే ముఖ్యం.. మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

తెలంగాణ‌లో బీఆర్ఎస్ వెయ్యి ఏళ్లు అయినా అధికారంలోకి రాద‌ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీల‌క వ్యాఖ్యలు చేశారు.

నాకు అదే ముఖ్యం.. మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ‌లో బీఆర్ఎస్ వెయ్యి ఏళ్లు అయినా అధికారంలోకి రాద‌ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీల‌క వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ రిటైర్డ్ అయ్యి ఫామ్‌హౌస్‌లో రెస్ట్ తీసుకుంటే మేలని అన్నారు.2018లో రాష్ట్రంలో బ‌డా బ‌డా లీడ‌ర్లు సైతం ఓడిపోయార‌న్నారు. త‌నపై నమ్మకంతో మునుగోడు ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించారని అన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండడంతో కేసీఆర్ త‌మ గొంతు నొక్కేశాడని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అయినప్పటికీ అసెంబ్లీలో మునుగోడు నియోజకవర్గ సమస్యలపై గళం వినిపించానని చెప్పారు. మునుగోడు కోసం అంద‌రు ఎమ్మెల్యేల కంటే ఎక్కువ మాట్లాడాన‌ని అన్నారు.

మునుగోడుకు పూర్తిగా నిధులు ఇవ్వ‌క‌పోతే ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశాన‌న్నారు. ఎల్బీ న‌గ‌ర్ నుండి పోటీ చేస్తే మంత్రి పదవి కూడా ఇస్తామని హామీ ఇచ్చారని కానీ తనకు పదవుల కంటే మునుగోడు ప్రజలే ముఖ్యమని చెప్పారు. మంత్రి పదవిని కూడా పక్కనపెట్టి మునుగోడు ప్రజల కోసం పని చేశాన‌ని అన్నారు. బీజేపీ నుండి కాంగ్రెస్ లోకి వస్తే తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. తరవాత పార్లమెంట్ ఎన్నికల సమయంలో చామలను ఎంపీగా గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పారన్నారు. తనకు పదవి ఇవ్వకపోయినా పర్వాలేదని కానీ నియోజకవర్గానికి అన్యాయం చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. ప్రజలు తనను నమ్మి గెలిపించారని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల‌ని అన్నారు.

Next Story