- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kodandaram: తెలిసీ తెలియక మాట్లాడుతున్నారు.. ఎమ్మెల్సీ రద్దుపై కోదండరాం ఫస్ట్ రియాక్షన్
ఎమ్మెల్సీ రద్దుపై కోదండరాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్సీలుగా తనతో పాటు అణీర్ అలీఖాన్ ల నియామకం రద్దు చేయడంపై ప్రొఫెసర్ కోదండరాం (Kodandaram) తొలిసారి స్పందించారు. ఎమ్మెల్సీ అనర్హతపై (cancellation of MLC appointment) సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే ఇచ్చిందని తెలిసీ తెలియక చాలా మంది మాట్లాడుతున్నారని అన్నారు. ఇవాళ టీజేఎస్ కార్యాలయంలో జాతీయపతాకావిష్కరణ చేసిన అనంతరం ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన సుప్రీంకోర్టు నిర్ణయంపై అంతిమ నిర్ణయం ప్రభుత్వమే తీసుకుంటుందని చెప్పారు. ప్రభుత్వం న్యాయ నిపుణలను కలిసి నిర్ణయం తీసుకుంటుందన్నారు. తానింకా సీఎంను కలవలేదని తుది తీర్పు వచ్చాకే పూర్తిస్థాయిలో మాట్లాడుతానన్నారు.
కాగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ లు ప్రమాణ స్వీకారం చేయడంపై దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు కోదండరామ్, అమీర్ అలీఖాన్ ల నియామకాన్ని రద్దు చేసింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించిన సుప్రీంకోర్టు అప్పట్లో తాము స్టే ఇచ్చి ఉండకూడదని వ్యాఖ్యానించింది. ఇద్దరి ప్రమాణ స్వీకారమే సరికాదన్న ధర్మాసనం వారి పేర్లను మళ్లీ సిఫారసు చేసేందుకు చాన్స్ కల్పించింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 17కు విచారమ వాయిదా వేసింది.






