- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి పదవిపై కోదండరాం మనసులోని మాట
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రొఫెసర్ కోదండరాం, భారత మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌ల నియామకానికి లైన్ క్లియర్ అయింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రొఫెసర్ కోదండరాం, భారత మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌ల నియామకానికి లైన్ క్లియర్ అయింది. వీరిద్దరి అభ్యర్థిత్వాలను ఆమోదిస్తూ గవర్నర్ సంతకం చేయడంతో, దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ మరికొద్ది సేపట్లో విడుదల కానుంది. తమ నియామకానికి ఆమోదం లభించినట్లు వార్తలు రావడంతో ప్రొఫెసర్ కోదండరాం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారంపై స్పందిస్తూ, పదవుల కోసం తాను ఏనాడూ ఆశపడలేదని స్పష్టం చేశారు. "నాకు మంత్రి పదవిపై ఎలాంటి ఆశ లేదు. ప్రజా సమస్యలపై గొంతు వినిపించేందుకు ఎమ్మెల్సీ అనేది కేవలం ఒక అదనపు బాధ్యత మాత్రమే. అంతకు మించి నాకు వ్యక్తిగత ప్రయోజనాలపై ఆసక్తి లేదు." అని కోదండరాం వెల్లడించారు.
ప్రజా సేవకే ప్రాధాన్యం..
ఉద్యమ కాలం నుండి తాను ప్రజల పక్షానే ఉన్నానని, భవిష్యత్తులో కూడా శాసనమండలి వేదికగా ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పని చేస్తానని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగత లాభం కంటే ప్రజా ప్రయోజనాలే తనకు మిన్న అని ఆయన పునరుద్ఘాటించారు. మరోవైపు ఇప్పటికే మంత్రిగా కొనసాగుతున్న అజారుద్దీన్ ఎమ్మెల్సీ ఖరారు కావడంతో ఆయన ఊరట లభించింది. ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు న్యాయపరమైన చిక్కులు తొలిగిపోవడంతో గవర్నర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గెజిట్ విడుదలైన వెంటనే వీరిద్దరి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ నియామకాలతో తెలంగాణ శాసనమండలిలో పాలకపక్షం మరింత బలోపేతం కానుంది.






