- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన కోదండరాం, మంత్రి అజారుద్దీన్ లు
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన అజారుద్దీన్, కోదండరాంలతో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సోమవారం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయించారు.

- ప్రమాణ స్వీకారం చేయించిన మండలి చైర్మన్ గుత్తా..హాజరైన సీఎం..పలువురు మంత్రులు
- నాకు మంత్రి పదవిపైన ఆశ కానీ, ఆలోచన కానీ లేదు : ఎమ్మెల్సీ కోదండరాం
- మా కెప్టెన్ సీఎం రేవంత్ రెడ్డి: మంత్రి అజారుద్దీన్
దిశ, తెలంగాణ బ్యూరో : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన అజారుద్దీన్, కోదండరాంలతో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సోమవారం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనమండలిలోని గుత్తా ఛాంబర్ లో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ తనకు మంత్రి పదవిపైన ఆశ కానీ, ఆలోచన కానీ లేదని స్పష్టం చేశారు. తాము కొంత కాలం నుంచి ఆదివాసీలకు భూమి, రిజర్వేషన్ల పెంపు, నిరుద్యోగ, విద్యార్ధుల సమస్యలు, ఫీజు రిఎంబర్స్ మెంట్, కార్మికుల హక్కులు, ఉద్యమకారుల సంక్షేమం, ఉద్యమకారుల ఆకాంక్షల సాధన వంటి అంశాలపైన కమిటిలు వేసుకున్నామన్నారు. ఈ అంశాలపైన పనిచేస్తున్నామని కోదండరాం తెలిపారు. తాము తెలంగాణ సిద్దించినప్పటి నుంచి ప్రజల పక్షాన పోరాడుతున్నామని, కేసులు కూడా ఎదుర్కొన్నామని ఆయన చెప్పారు. జయశంకర్ సార్ చెప్పినట్లుగా ప్రజల కోసం ముందుకెళ్లామని కోదండరాం పేర్కొన్నారు.
తమ కెప్టెన్ సీఎం రేవంత్ రెడ్డి: మంత్రి అజారుద్దీన్
తమ కెప్టెన్ రేవంత్‌రెడ్డి అని, తాను ఇప్పుడు కెప్టెన్ కాదని మంత్రి అజారుద్దీన్ అన్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో క్లీన్‌బౌల్డ్ లు ఉండవన్నారు. తన ఎమ్మెల్సీ పదవి కోసం సీఎం ఎంతో కృషి చేశారని, సీఎం గురించి ఎంత చెప్పినా తక్కువే అని అజారుద్దీన్ అన్నారు. తనకు అవకాశం ఇచ్చిన రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ లకు అజారుద్దీన్ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ సక్సెస్ కావాలంటే ఎంతో ఓపికతో ఉండాలని, పార్టీ కోసం పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో మహిళలు, విద్యార్ధుల సంక్షేమ కోసం కృషి చేస్తానని, మైనార్టీల సంక్షేమం కోసం సీఎం ఎంతో చేస్తున్నారని, తెలంగాణ రైజింగ్ అవుతోందని, అభివృద్దిలో మార్పులు తమ ప్రభుత్వం చూపిస్తందన్నారు. తమ ఫ్యామిలీలో తన కుమారుడు కూడా రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ గా ఉన్నారని మంత్రి అజారుద్దీన్ తెలిపారు. తనకు క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువ అని, పొలిటికల్ ఫ్యాన్స్‌ను కూడా పెంచుకుంటానని ఆయన చెప్పారు. ప్రత్యర్థి పార్టీలు ఏమైనా మాట్లాడటం సహజమని అజారుద్దీన్ అన్నారు.






