- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy Kites : సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో పతంగులు
సంక్రాంతి(Sankranti)అంటేనే ముందుగా గుర్తొచ్చేది గాలిపటా(Kites)ల ఎగరవేత సంబురాలు. సంక్రాంతి వేడుకల్లో చిన్నా, పెద్ద అంతా పతంగుల ఎగరవేతలో ఉత్సాహంగా పోటీ పడుతుంటారు.

దిశ, వెబ్ డెస్క్ : సంక్రాంతి(Sankranti)అంటేనే ముందుగా గుర్తొచ్చేది గాలిపటా(Kites)ల ఎగరవేత సంబురాలు. సంక్రాంతి వేడుకల్లో చిన్నా, పెద్ద అంతా పతంగుల ఎగరవేతలో ఉత్సాహంగా పోటీ పడుతుంటారు. పండుగ వేళ పతంగులకు ఉండే క్రేజ్ తో పతంగుల తయారీ దారులు రకరకాల ఆకృతులతో, బొమ్మలతో పతంగుల(Different Kites Sales)ను తయారు చేసి విక్రయిస్తుంటారు. పండుగ నాటికి ఉంటే అప్పటి పరిస్థితులను అనుసరించి బాహుబలి..రోబో..పుష్ప, రోబో, స్పైడర్ మ్యాన్ వంటి క్రేజీ హీరోల బొమ్మలతో, కార్టూన్ క్యారెక్టర్స్ తో..జంతువుల బొమ్మలతో రకరకాల పతంగులను తయారు చేస్తుంటారు.
కొందరు తమ అభిమాన నాయకులతో కూడిన ఫోటోలతో పతంగులు చేస్తుంటారు. ఈ క్రమంలో రాష్ట్ర ఫిషరీస్ కార్పోరేషన్ చైర్మన్(Chairman of the State Fisheries Corporation( మెట్టు సాయికుమార్(Mettu Saikumar) సీఎం రేవంత్ రెడ్ది(CM Revanth Reddy)ఫోటోతో కూడిన పతంగు(Photo Kites)లు తయారు చేయించి పిల్లలకు ఉచితంగా అందిస్తు తన అభిమానాన్ని చాటుకుంటున్నారు. గతంలో సీఎం జన్మదినం సందర్భంగా పూరీలో రేవంత్ రెడ్డి సైకత శిల్పం తయారు చేయించిన మెట్టు..ఈ దఫా సంక్రాంతి పండుగ సందర్భంగా రేవంత్ ఫోటోతో కూడిన పతంగులను తయారు చేయించి పిల్లలకు పంపిణీ చేస్తుండటం విశేషం.
ఈ సందర్భంగా మెట్టు సాయికుమార్ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్న సీఎం రేవంత్ రెడ్డి నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని, ఆయన నాయకత్వంలో తెలంగాణ ప్రగతి ప్రపంచ స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.






