జనవరి 13 నుంచి పతంగుల పండుగ

by Muthe.Rajitha |

ప్రతిఏటా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జనవరిలో నిర్వహించే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఈ ఏడాది కూడా గ్రాండ్ గా జరగనుంది.

జనవరి 13 నుంచి పతంగుల పండుగ
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రతిఏటా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జనవరిలో నిర్వహించే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఈ ఏడాది కూడా గ్రాండ్ గా జరగనుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ వేదికగా పతంగుల పండుగ నిర్వహించనున్నారు. జనవరి 13 నుంచి 18 వరకు ఈ అంతర్జాతీయ పతంగుల ఫెస్టివల్ జరపనున్నట్టు టూరిజం స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్ పేర్కొన్నారు. కాగా ప్రతిఏటా ఈ ఫెస్టివల్ లో దేశ విదేశాల విచ్చేసిన ప్రత్యేక పర్యాటకులు వివిధ ఆకృతుల్లో ఉండే కైట్స్ ఎగురవేస్తారు.

కాగా ఈ ఏడాది స్పెషల్ గా డ్రోన్ షో, హాట్ ఎయిర్ బెలూన్ షో కూడా నిర్వహించనున్నారు. జనవరి 13 నుంచి 15 వరకు కైట్స్, స్వీట్స్ ఫెస్టివల్ జరగనుండగా.. 13,14 తేదీల్లో డ్రోన్ షో కూడా జరగనుంది. అలాగే 16 నుంచి 18 వరకు హాట్ ఎయిర్ బెలూన్ షో జరగనుంది. కైట్ ఫెస్టివల్ కు ప్రవేశం ఉచితం కాగా భారీగా నగర పౌరులు హాజరు కావాలని అధికారులు కోరారు.

Next Story