అసలు విషయం తెలిసి CM చేతులెత్తేశాడు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి షాకింగ్ ట్వీట్

by Gantepaka Srikanth |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy)పై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అసలు విషయం తెలిసి CM చేతులెత్తేశాడు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి షాకింగ్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy)పై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ అక్షయ పాత్ర అన్నారు. ప్రజలను మభ్యపెట్టి అధికారం చేజిక్కించుకున్నారు. ఇప్పుడు హామీలు పూర్తి చేయలేని స్థితికి వచ్చేసరికి ప్రజా సంక్షేమానికి పైసలు లేవని చేతులెత్తేస్తున్నారు. రాష్ట్ర ఖజానాలో నిధులు ఉన్నాయనుకొని ఆరు గ్యారంటీలు(Six Guarantees), 420 హామీలు ఇచ్చామంటున్నారు.. ఇప్పుడు రాష్ట్ర ఖజానాలో నిధులు లేవని తెలిసేసరికి, తానే మోసపోయానని కల్లబొల్లి మాటలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నాడు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారమే లక్ష్యంగా ఇష్టమొచ్చినట్లు హామీలు గుప్పించారని విమర్శించారు. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ఎంతకైనా తెగిస్తుందని చెప్పడానికి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు, చేసిన వ్యాఖ్యలే నిదర్శనం అని నిన్న ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ విమర్శించారు. తనపై కూడా ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు. ఆయన చేసిన ఆరోపణలకు ఎన్నికల్లో ప్రజలే సరైన తీర్పు ఇచ్చారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించి కాంగ్రెస్‌కు చెంపపెట్టులాంటి జవాబిచ్చారని కిషన్ రెడ్డి అన్నారు. ప్రజాతీర్పును గౌరవించి ఇకనైనా ఎన్నికల హామీల అమలుపై దృష్టి పెట్టాలంటూ రేవంత్ రెడ్డికి హితవు పలికారు.

Next Story