Kishan Reddy : అల్లు అర్జున్ అరెస్టుపై కిషన్ రెడ్డి స్పందన

by Muthe.Rajitha |   (  Updated:2024-12-13 14:48:34  IST  )

ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్(Allu Arjun) అరెస్టు ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) పేర్కొన్నారు.

Kishan Reddy : అల్లు అర్జున్ అరెస్టుపై కిషన్ రెడ్డి స్పందన
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్(Allu Arjun) అరెస్టు ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) పేర్కొన్నారు. కార్యక్రమ నిర్వాహకులు సంబంధిత అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ.. అరెస్టు చేయడం ఉద్దేశపూర్వకమేనని అర్థమవుతోందన్నారు. కార్యక్రమ వేదిక వద్ద భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులదని, కానీ అది చేయకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో సినీ నటులను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారనేది మరోసారి నిరూపితమైందని తెలిపిన కిషన్ రెడ్డి... ఈ అరెస్టును, పాలకుల అధికార దుర్వినియోగాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు.

కాగా సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద పుష్ప-2 ప్రీమియిర్ షో(Pushpa-2 Premior Show) సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్‌ ను నేడు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌ (Chikkadpally Police Station)లో స్టేట్మెంట్ రికార్డ్ చేసి, గాంధీ ఆసుపత్రి(Gandhi Hospital)లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. నాంపల్లి కోర్టు (Nampally Court)లో హాజరుపరిచారు. కోర్ట్ బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించగా.. చంచల్ గూడ జైలుకు తరలించారు. మరోవైపు చిక్కడపల్లి పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లు కొట్టి వేయాలని హైకోర్టు(High Court)లో బన్నీ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ పై విచారణ చేపట్టిన కోర్ట్.. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు అల్లు అర్జున్ కు వర్తించవని, మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.


Read More..

అల్లు అర్జున్ అరెస్ట్‌తో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వేణు స్వామి జాతకం (వీడియో)

Next Story