- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kishan Reddy: తెలంగాణకు రూ.లక్షా 50 వేల కోట్లు రాబోతున్నాయి
బడ్జెట్(Union Budget)పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: బడ్జెట్(Union Budget)పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం ఏ సంస్కరణ తీసుకువచ్చినా తెలంగాణకు భాగస్వామ్యం ఉంటుందని అన్నారు. తెలంగాణలో పది లక్షలకుపైగా MSME ఉన్నాయి.. స్టార్టప్ కంపెనీలకు కూడా లబ్ధి జరుగుతుంది.. ఐదేళ్లలో తెలంగాణ MSMEలకు రూ.లక్షా 50 వేల కోట్లు రాబోతున్నాయని కిషన్‌రెడ్డి ప్రకటించారు. అర్బన్ ప్రాంతాలకు రూ.10వేల కోట్లు రాబోతున్నాయని వెల్లడించారు. అమృత్ పథకం ద్వారా 125 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్ అంకితం అని ప్రకటించారు. కాగా, దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా తయారీ రంగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర బడ్జెట్‌లో కీలక ప్రకటనలు చేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. సమ్మిళిత అభివృద్ధి, పరిశ్రమలకు మద్దతు ఇచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు.
కొన్ని వస్తువులపై సుంకాలను తగ్గించినట్లు తెలిపారు. దీంతో ఎలక్ట్రానిక్స్, కీలక ఔషధాల ధరలు తగ్గనున్నాయని అన్నారు. మరికొన్ని వస్తువులపై మాత్రం కస్టమ్స్ డ్యూటీ (Custom Duty)ని పెంచినట్లు పేర్కొన్నారు. మరోవైపు.. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోలేదని మండిపడుతున్నారు. ప్రతిష్టాత్మక పథకాలకు కూడా బడ్జెట్లో కేటాయింపులు చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. దీంతో తెలంగాణ బడ్జెట్‌పై రేవంత్ సర్కార్ స్పెషల్ ఫోకస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ 2025-26 బడ్జెట్‌ను రూపొందించాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశించినట్లు సమాచారం.






