- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్ర ఆర్థిక స్థితిపై వాస్తవాలు బయటపెట్టండి.. CMకు కిషన్‍రెడ్డి లేఖ
రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం (White Paper) విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (Revanth Reddy) డిమాండ్ చేశారు. ఈ మేరకు కిషన్ రెడ్డి మంగళవారం సీఎంకు బహిరంగ లేఖ రాశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టో ద్వారా ప్రజలకు 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలను ఇచ్చిందని ఈ హామీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఖజానాలో లంకెబిందెలకు బదులు ఖాళీ మట్టి కుండలు ఉన్నాయంటూ వ్యంగ్యంగా మాట్లాడుతూ మీరిచ్చిన హామీల అమలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారని విమర్శించారు.
రాష్ట్ర ఖజానా నిల్.. కాంగ్రెస్ నేతల జేబులు ఫుల్:
రాష్ట్ర ఖజానా గురించి ఇలా మాట్లాడిన మీరే ఇటీవల ఓ సభలో మాట్లాడుతూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి అవసరమైతే రూ. 1000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మీరు మాట్లాడిన తీరు చూస్తుంటే రాష్ట్ర ఖజానా నిల్.. కాంగ్రెస్ నేతల జేబులు ఫుల్ అనేలా పరిస్థితి తయారైందని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సి ఉందని లేఖలో పేర్కొన్నారు. కేంద్రం ఇప్పటి వరకు రూ. 12 లక్షలకోట్ల నిధులు ఇచ్చిందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని దుయ్యబట్టారు.






