- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kishan Reddy: రానున్న మూడేళ్లు మోడీ ప్రభుత్వానికి చాలా కీలకం
అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ముఖ్యమైన అంశం, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ - 1961 సవరణ జరగాలని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ముఖ్యమైన అంశం, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ - 1961 సవరణ జరగాలని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. ఈ విషయం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చర్చించిందని తెలిపారు. లా కమిషన్ ఆఫ్ ఇండియాకు దృష్టి సారిస్తుందనన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ లీగల్ సెల్ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ హజరయ్యారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ కంపెనీలు న్యాయవాదులకు ప్రమియం ఇన్సూరెన్స్ చేయడం లేదని తెలిపారు. ఆ విషయం కూడా చర్చిస్తున్నాం అని తెలిపారు. అడ్వకేట్స్ ఎంతమంది ఉన్నారో స్పష్టంగా తెలియడం లేదని ఒకరు 20 లక్షల మంది ఉన్నారని మరొకరు 25 లక్షల ఉన్నారని తెలుపుతున్నారని అన్నారు. బార్ కౌన్సిల్‌కు ఇన్సూరెన్స్ ప్రీమియం చేయించమని చెప్పామని తెలిపారు.
లాయర్ ఫీజ్ పెంచేలా చర్యలు చేపడతాం అని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం శాఖ అనేక రిఫార్మ్స్ తీసుకువస్తోందని తెలిపారు. బ్రిటీష్ చట్టాలు ఇప్పటికీ అమలు అవుతున్నాయని తెలిపారు. వర్తమాన ప్రజల ఆలోచనలకు అనుగుణంగా చట్టాలు తేవాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆలోచిస్తున్నారని చెప్పుకొచ్చారు. అర్జున్ రామ్ మేఘవాల్ ఐఏఎస్‌గా ఉన్నప్పటికీ రాజీనామా చేసి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారని ప్రశంసించారు. బీజేపీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వ ఇమేజ్ పెంచే ప్రయత్నం చేయాలని దిశానిర్దేశం చేశారు. కేంద్రం పాలసీలకు అనుగుణంగా కోర్టుల్లో మనం వాదిస్తామనేది చాలా కీలకమని తెలిపారు. రానున్న మూడేళ్లు మోడీ ప్రభుత్వానికి చాలా కీలకమని తెలిపారు. వామన రావు దంపతుల హత్య కేసు సీబీఐ దర్యాప్తు చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. ఈ సమావేశంలో జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు డా. కె.లక్ష్మణ్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌కు లీగల్ సెల్ వినతి పత్రం
రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల పై జరుగుతన్న దాడులపై చర్యలను చెపట్టలని, రక్షణ కల్పించాలని తెలంగాణ బీజేపి లీగల్ సెల్ అధ్వర్యంలో కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వినతి పత్రం అందజేశారు. తెలంగాణ బార్ కౌన్సిల్ క్రింద 60వేల మంది న్యాయవాదులు ఉన్నట్లు లీగల్ సెల్ సభ్యులు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. న్యాయవాదుల హక్కులు, విధులు కాపాడేందుకు చర్యలు చెపట్టాలని కోరారు. రాష్ట్రంలో న్యాయవాదుల పై జరిగిన దాడులు, హత్యలు వివరించారు. రౌడి షీటర్లు న్యాయవాదుల పై దాడులు చేయడం దేశ వ్యాప్తంగా రాష్ట్రంలో మాత్రమే జరిగినట్లు వివరించారు. న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి ఎటువంటి వైద్య, పదవీ విరమణ, మరణ ప్రయోజనాలను పొందడం లేదని తెలిపారు. జూనియర్ న్యాయవాదులకు వైద్య బీమా, మరణ ప్రయోజనం, పదవీ విరమణ ప్రయోజనం స్టైఫండ్ అందించడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకునేవిధంగా దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఈ వినతి పత్రం అందజేసిన వారిలో బిజెపి లీగల్ సెల్ కన్వీనర్ రామారావు, తెలంగాణ బార్ కౌన్సిల్ అధ్యక్షులు నర్సింహా రెడ్డి, ఉపాధ్యక్షులు సునీల్ గౌడ్, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, రవీందర్ విశ్వనాథ్, బాలరాజు, సుంకరి జనార్ధన్ పాల్గొన్నారు.






