‘మీ ఒక్కరికే కాదు.. ఆ చట్టం మాక్కూడా వర్తిస్తది’.. కాంగ్రెస్ నేతలపై కిషన్ రెడ్డి సెటైర్

by Gantepaka Srikanth |

నేరాభియోగాల నేతల తొలగింపు బిల్లుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లును దేశమంతా స్వాగతిస్తోందని అన్నారు.

‘మీ ఒక్కరికే కాదు.. ఆ చట్టం మాక్కూడా వర్తిస్తది’.. కాంగ్రెస్ నేతలపై కిషన్ రెడ్డి సెటైర్
X

దిశ, వెబ్‌డెస్క్: నేరాభియోగాల నేతల తొలగింపు బిల్లుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లును దేశమంతా స్వాగతిస్తోందని అన్నారు. దేశంలోని అన్ని పార్టీలకు వర్తించేలా చట్టం తీసుకొచ్చామని చెప్పారు. కేవలం కాంగ్రెస్(Congress) లేదా ఇతర పార్టీల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన చట్టం కాదు.. మాకు కూడా వర్తిస్తది అని అన్నారు. ఎవరికీ లేని ఇబ్బంది ఈ బిల్లు విషయంలో కాంగ్రెస్ నేతలకే ఎందుకు వస్తుందో తెలియడం లేదని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్ కూటమి వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరమన్నారు. లోక్‌సభ(Lok Sabha)లో ఇండియా కూటమి నేతలు బరితెగించి ప్రవర్తిస్తున్నారని కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు.

కాగా, తీవ్ర నేరాభియోగాలపై అరెస్టై వరసగా 30 రోజులపాటు జైల్లో ఉన్నట్లయితే రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు.. చివరకు ప్రధానమంత్రినైనా 31వ రోజే పదవి నుంచి తప్పించే కీలకమైన బిల్లును బుధవారం లోక్‌సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పెట్టారు. ఈ నిబంధనలు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్ధమని, రాజకీయ దురుద్దేశాలతో పలువురిని గద్దె దించడానికి ఇవి దోహదపడతాయని విపక్షం తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది.

Next Story