- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘హైటెక్ సిటీ కాదు.. నిజమైన హైదరాబాద్ పాతబస్తే’: కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
వర్షాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: వర్షాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ కాదు.. నిజమైన హైదరాబాద్ పాతబస్తీనే అని అన్నారు. వర్షాలకు మొన్న ఇద్దరు కొట్టుకుపోయారు.. నిన్న ఒకరు మరణించారు.. ఏ బస్తీ చూసినా వర్షం నీటిలో మునిగిపోయాయి.. ఇలాంటి పరిస్థితులతో నరగంపై కొంత నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడుకోవాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే.. నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం మళ్లీ భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఫిల్మ్‌నగర్, ఎర్రగడ్డ, యూసఫ్‌గూడ, అమీర్‌పేట, బోరబండ, చార్మినార్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.






