బీబీసీపై హరీష్ రావు వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్

by Disha Web Desk 2 |
బీబీసీపై హరీష్ రావు వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీబీసీపై ఐటీ దాడులతో దేశ ప్రతిష్ట దిగజార్చుతున్నారన్న మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాము ఎవరిపై దాడులు చేయడం లేదని ఎదురు దాడి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో టీవీ ఛానెల్స్ పై తెలంగాణలో నిషేధం పెట్టిన సంగతి గుర్తు చేసుకోవాలన్నారు. బీఆర్ఎస్ నుంచి తాము పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. గురువారం ఢిల్లీలో మాట్లాడిన ఆయన టూరిజం శాఖ ఆధ్వర్యంలో దేశ పర్యాటక రంగంలో కొత్త మార్పులు తీసుకువస్తున్నామని చెప్పారు.

టూరిజం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లోగో, టీజర్ ను ఆవిష్కరించారు. ప్రపంచ పర్యాటక రంగంలో భారత్ ముఖ్య పాత్ర పోషించబోతుందని, పర్యాటక రంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. అన్ని మంత్రిత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తునట్టు తెలిపారు. దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.

Also Read...

పర్యాటక రంగ అభివృద్ధిపై కేంద్రం దృష్టి: కిషన్ రెడ్డి

Next Story