బ్రేకింగ్: బీఆర్ఎస్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి కిషన్ రెడ్డి ఫిర్యాదు

by Satheesh |

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు రాజకీయ నేతలు ఎలాంటి పొలిటికల్ కామెంట్స్ చేయకూడదు.. కానీ బీఆర్ఎస్ నేతలు కోడ్ ఉల్లంఘిస్తున్నారని బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్

బ్రేకింగ్: బీఆర్ఎస్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి కిషన్ రెడ్డి ఫిర్యాదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు రాజకీయ నేతలు ఎలాంటి పొలిటికల్ కామెంట్స్ చేయకూడదు.. కానీ బీఆర్ఎస్ నేతలు కోడ్ ఉల్లంఘిస్తున్నారని బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈసీకి కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కిషన్ రెడ్డి లేఖ రాశారు. నియోజకవర్గాల్లో వంద నుంచి రెండు వందల మంది బీఆర్ఎస్ నేతలు గుమి గుడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవట్లేదని తెలిపారు. తాజాగా జనగామ‌లో జరిగిన ఒక ఘటనను ఉదాహరణగా వెల్లడించారు. చాలా నియోజక వర్గాల్లో బీఆర్ఎస్ నేతలకు అధికారులు పరోక్ష సహకారం అందిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అంబర్‌పేటలో బీఅర్ఎస్ అభ్యర్థి తనయుడు డబ్బులు పంచిన ఆయనపై చర్యలు తీసుకోవడంలో విఫలం అయ్యారంటూ ఈసీకి లేఖ ద్వారా కంప్లైంట్ చేశారు.

Next Story