వందేభారత్ రైల్లో వరంగల్ వెళ్లిన కిషన్ రెడ్డి.. ‘చాయ్ పే చర్చ’లో కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-29 04:22:22  IST  )

సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు ఉదయం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో వరంగల్‌కు చేరుకున్నారు.

వందేభారత్ రైల్లో వరంగల్ వెళ్లిన కిషన్ రెడ్డి.. ‘చాయ్ పే చర్చ’లో కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఈ రోజు ఉదయం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో వరంగల్‌కు చేరుకున్నారు. సామాన్య ప్రయాణికుడిలా ప్రయాణించిన ఆయన, ప్రయాణికులతో సెల్ఫీలు తీసుకుని, సరదాగా మాట్లాడుతూ ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ మేరకు ఆయన మొదటగా నగర పరిధిలోని రైల్వే స్టేషన్‌ను పరిశీలించారు. అదేవిధంగా అక్కడ స్టేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని పనులు త్వరలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

అనంతరం స్టేషన్ క్యాంటీన్‌లో సిబ్బందితో కలిసి నిర్వహించే ‘చాయ్ పే చర్చ’ (Chai Pe Charcha) కార్యక్రమంలో పాల్గొని, రైల్వే సిబ్బంది సమస్యలు, సౌకర్యాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. వందే భారత్ రైళ్లు తెలంగాణలో ప్రయాణికులకు అందుబాటులోకి రావడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతున్నాయని, మరిన్ని రైల్వే ప్రాజెక్టులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. హైదరాబాద్ (Hyderabad) సిటీ శివారులో చర్లపల్లి (Charlapally) వద్ద ఎయిర్‌పోర్టును తలదన్నేలా రైల్వే టెర్మినల్‌ (Railway Terminal)ను నిర్మించామని అన్నారు. అక్కడి నుంచి లోకల్ బీజేపీ నాయకులతో కలిసి కిషన్ రెడ్డి భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.

Next Story