కాంగ్రెస్ విష ప్రచారాన్ని ప్రజలు తిప్పి కొట్టారు : కిషన్ రెడ్డి

by Muthe.Rajitha |

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ విష ప్రచారాన్ని ప్రజలు తిప్పి కొట్టారు : కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. బిహార్ విజయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. బీహార్‌లో ప్రజలు మేం ఊహించనంత భారీ మెజార్టీ ఇచ్చారని సంతోషం వ్యక్తం చేసారు. ఓటు చోరీపై కాంగ్రెస్ పార్టీ చేసిన విషప్రచారాన్ని ప్రజలు పూర్తిగా తిప్పికొట్టారని కిషన్ రెడ్డి అన్నారు. దేశమంతా S.I.R (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్) జరగాలని ఆయన డిమాండ్ చేశారు.

అంతేకాదు జూబ్లీహిల్స్‌లో ఓటరు జాబితా తప్పుల తడకగా ఉందని, ఉపఎన్నికకు ముందు దానిని సవరిస్తే ఫలితాలు తారు మారు అయ్యేవని పేర్కొన్నారు. దేశంలో మరో 10 ఏళ్ళు మోడీ పాలన కొనసాగుతుందని, ప్రజలు బీజేపీపై పూర్తి నమ్మకం ఉంచారని అన్నారు. దానిని మేము నిలబెట్టుకుంటున్నామని, అందుకే మళ్ళీ మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తున్నారని కిషన్ రెడ్డి వెల్లడించారు.

Next Story