- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సగం తెలంగాణలో పట్టు సాధించిన BJP.. అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన ప్రకటన
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక(Graduate MLC Elections)ల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఘన విజయం సాధించారు.

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక(Graduate MLC Elections)ల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఘన విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో అంజిరెడ్డి(Anji Reddy) విజయాన్ని దక్కించుకున్నారు. తాజాగా ఈ విజయంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ విజయం చిరస్మరణీయం అన్నారు. ఈ విజయం మా బాధ్యతను మరింత పెంచిందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగామని కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు తప్పకుండా బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని అన్నారు. మరోవైపు వరుస విజయాలతో తెలంగాణలో బీజేపీ మాంచి ఊపుమీదున్నది. దాదాపు సగం తెలంగాణలో పట్టు సాధించినట్లు కనిపిస్తున్నది. 2018 ఎన్నికల్లో ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు గెలుచుకున్న బీజేపీ.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, లోక్‌సభ ఎన్నికల్లో ఎనిమిది మంది ఎంపీలు గెలుపొందారు. తాజాగా రెండు ఎమ్మెల్సీలు గెలుపొందడంతో 6 లోక్‌సభ స్థానాలు, 42 అసెంబ్లీ నియోజకవర్గాలు, 13 జిల్లాలు, 217 మండలాల్లో బీజేపీ పట్టు సాధించింది. దీంతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో సంబురాల్లో నిమగ్నమయ్యారు.
మరోవైపు మొన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య(BJP candidate Malka Komaraiah) మొదటి ప్రాధాన్య ఓట్లతోనే ఘన విజయం సాధించారు. ఆయన తన సమీప పీఆర్టీయూ బలపరిచిన అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డిపై 5,777 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. నియోజకవర్గంలో మొత్తం 25,041 ఓట్లు పోల్ కాగా 897 ఓట్లు చెల్లకుండా పోయాయి. 24,144 ఓట్లు చెల్లుబాటు కాగా అభ్యర్థి గెలుపొందడానికి 12,081 కోటా ఓట్లుగా గుర్తించారు. బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులోనే కోటా ఓటుకు మించి ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆయనను మొదటి ప్రాధాన్య ఓటుతోనే గెలుపొందినట్లుగా ప్రకటించారు.






