- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధాని మోడీని, మమ్మల్ని విమర్శిస్తే భరిస్తాం.. కాంగ్రెస్ నేతలపై కిషన్ రెడ్డి ఫైర్
మిస్‌వరల్డ్ అందాల పోటీల పై ఉన్న శ్రద్ధ హైదరాబాద్ అందాలపై లేదని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: మిస్‌వరల్డ్ (Miss World) అందాల పోటీల పై ఉన్న శ్రద్ధ హైదరాబాద్ అందాలపై లేదని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) విమర్శించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పర్యటనలో భాగంగా శుక్రవారం ఖైరతాబాద్ అసెంబ్లీ, హిమాయత్ నగర్ డివిజన్, బగ్గిఖానా బస్తీని కిషన్ రెడ్డి విజిట్ చేశారు. నూతనంగా నిర్మించిన కమిటీ హల్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం బస్తీలో పర్యటించి వారి బస్తీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని సూచించారు. హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ మాత్రమే కాదని, హైదరాబాద్ అంటే పాత బస్తీ లోని అనేక ప్రాంతాలు ఉన్నాయని సీఎం మర్చిపోయారని ఆరోపించారు. మరోవైపు సైనికులను అవమాన పరిచే రీతిలో కాంగ్రెస్ నేతలు మాట్లాడటం దురదృష్టకరమన్నారు.
ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) అంటే ఏమిటో ప్రపంచానికి తెలిసింది.. కానీ కాంగ్రెస్ (Congress) నేతలకు తెలియకపోవడం బాధాకరమని అన్నారు. ప్రధాని మోడీని విమర్శించండి, మమ్మల్ని విమర్శించండి భరిస్తాం.. కానీ సైనికులను అధికారులను అవమాన పరచకండి అది దేశాన్ని అవమానించినట్లే అని ఆవేదన వ్యక్తం చేశారు. సర్జికల్ స్ట్రైక్ పైన ఆధారాలు చూయించాలనీ గతంలో కేసీఆర్, కవితలు అడిగారని గుర్తుకు చేశారు. ఎప్పటికప్పుడు ఆపరేషన్ సింధూర్ పై అప్డేట్ ఇచ్చినప్పటికీ ఆపరేషన్ సింధూర్ పై ఆధారాలు చూపించాలనీ కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారని అన్నారు. ఆపరేషన్ సింధూర్ లో ఒక్క విమానం కూలిపోలేదని బలగాలు స్పష్టంగా చెప్పాయని గుర్తుకు చేశారు. ఆపరేషన్ సింధూర్ పై కాంగ్రెస్ నేతలు రాజకీయం చేయడం దురదృష్టకరమని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
Also Read: కవిత మరో షర్మిల కాబోతోంది.. ఎంపీ రఘునందన్ సంచలన వ్యాఖ్యలు






