- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి కౌంటర్

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) కౌంటర్ ఇచ్చారు. యూపీఏ(UPA Govt) హయాంలో జరిగిన వైఫల్యాలను ఎన్డీఏకు ఆపాదించడం రాహుల్ అవివేకం అని విమర్శించారు. కాంగ్రెస్ 10 సంవత్సరాల పాలనలో 6 శాతం ఉపాధి పెరిగితే బీజేపీ(BJP) పాలనలో ఉపాధి 36 శాతానికి పెరిగిందని అన్నారు. మోడీ 10 ఏళ్ల పాలనలో 4.9 కోట్ల ఉద్యోగాలు వచ్చాయని గుర్తుచేశారు. వ్యవసాయరంగంలో ఉపాధి కాంగ్రెస్ హయాంలో 16 శాతం తగ్గితే.. మోడీ హయాంలో 19 శాతానికి పెరిగిందని అన్నారు. 2023-24 నాటికి దేశంలో నిరుద్యోగిత రేటు 3.2 శాతానికి తగ్గిందని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
కాగా, అంతకుముందు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దేశంలో నిరుద్యోగ సమస్యకు యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాలు సరైన పరిష్కారం చూపించలేకపోయాయని అన్నారు. ఉత్పత్తి ఆధారిత దేశంగా మనం విఫలమై.. దానిని చైనాకు అప్పగించామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకనైనా మనం ఉత్పత్తి పైనే పూర్తిగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ‘మేకిన్ ఇండియా’ మంచి ఆలోచనే అయినప్పటికీ దానిని అమలు చేయడంలో ఎన్డీఏ ప్రభుత్వం విఫలం అవుతోందని అన్నారు. యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉంది.. మనం మాట్లాడేది ఏదైనా వారి గురించే అయి ఉండాలని కేంద్రానికి రాహుల్ హితవు పలికారు.