Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఫైర్

by Prasad Jukanti |

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు.

Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పాక్ పై యుద్ధ విరమణను తప్పుపడుతూ ప్రధాని నరేంద్ర మోడీపై సీఎం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ ఫైర్ అయింది. 'విమానం అంటే దిల్‌సుఖ్‌నగర్ రోడ్ పక్కన దొరికే బొమ్మ అనుకునే సీఎం రవ్వంత రెడ్డి గారు మీరు రాఫెల్ గురించి మాట్లాడితే ఒకటో తరగతి పోరగాడు కూడా నవ్వుతాడు అంటూ టీ బీజేపీ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నుండి ఆ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి వరకు మన సైన్యాన్ని నిత్యం కించపరుస్తూనే ఉన్నారని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి (Kishan Reddy) మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చౌకబారు రాజకీయాలు చేయడం ఇదే మొదటి సారి కాదని సర్జికల్ స్ట్రైక్స్‌ ను ప్రశ్నించారని ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి మన శత్రు భాష మాట్లాడటం పరిపాటేనన్నారు. కాగా నిన్న జైహింద్ సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి యుద్ధ విరమణ విషయంలో ప్రధాని మోడీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని వీర జవాన్లు, దేశ ప్రజలు పాకిస్థాన్ ను అంతం చేయాలన్న కసితో రగిలిపోతుండగా వారి ఆవేశంపై కేంద్రం నీల్లు చల్లిందన్నారు. 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవాన్నని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు తాకట్టు పెట్టారని ఆరోపించారు.

Next Story