- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kishan Reddy: ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత అర్థమైందా.. రేవంత్‌పై కిషన్ రెడ్డి పైర్
తెలంగాణలో బీజేపీది తిరుగులేని విజయమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)లో బీజేపీ (BJP)ది తిరుగులేని విజయమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలకులు మారిన పాలనలో ఏ మాత్రం మార్పు లేదని కామెంట్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిలబెట్టుకోలేదని ఫైర్ అయ్యారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతోన్న సీఎం రేవంత్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై ఏ స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఉందో ఎమ్మెల్సీ ఎన్నికలతో తేటతెల్లమైందని కామెంట్ చేశారు. ప్రజలు ఇచ్చిన విజయంతో బాధ్యత మరింత పెరిగిందని అన్నారు.
ఇక నుంచి తాము ‘సేవ్ తెలంగాణ - సపోర్ట్ బీజేపీ’ (Save Telangana - Support BJP) నినాదంతో ముందుకెళ్తామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ (BJP) అధికారంలోకి రావడం పక్కా అని జోస్యం చెప్పారు. ఇకనైనా తెలంగాణ (Telangana)లో డబుల్ ఇంజిన్ సర్కార్ (Double Engine Sarkar) రాకపోతే పరిస్థితులు దయనీయంగా మారే అవకాశం ఉందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీది తిరుగులేని విజయమని తెలిపారు. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గాను రెండింటిని కైవసం చేసుకున్నామని.. తెలంగాణ (Telangana) యువత, టీచర్లు తమపై పూర్తి నమ్మకం ఉంచి తమ అభ్యర్థులను ప్రత్యర్థుల అంచనాలకు అందకుండా గెలిపించడం సంతోషదాయకమని అన్నారు. తాను మళ్లీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసే ఛాన్స్ లేదని స్పష్టం చేశారు. త్వరలోనే తెలంగాణకు కొత్త అధ్యక్షుడు వస్తారని.. ప్రస్తుతం తను పార్టీ తాత్కాలిక అధ్యక్షుడిగానే కొనసాగుతున్నానని కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.






