- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రపంచానికి భారత్ ఇచ్చిన అద్భుతమైన బహుమతి యోగా: కిషన్ రెడ్డి
మోడీ ప్రధాని అయిన తరవాత ప్రపంచానికి భారత్ ఇచ్చిన అద్భుతమైన బహుమతి యోగా అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 200 దేశాలు మన భారతీయ సంస్కృతి అయిన యోగాను గుర్తించడం గర్వించాల్సిన విషయం అని చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: మోడీ ప్రధాని అయిన తరవాత ప్రపంచానికి భారత్ ఇచ్చిన అద్భుతమైన బహుమతి యోగా అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 200 దేశాలు మన భారతీయ సంస్కృతి అయిన యోగాను గుర్తించడం గర్వించాల్సిన విషయం అని చెప్పారు. యోగాను ప్రపంచానికి పరిచయం చేసిన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి వ్యక్తి జీవితంలో మోగా భాగం కావాలని కోరుకున్నారు. యోగా వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం లభిస్తుందని వ్యాక్యానించారు. యోగానే మన ప్రథమ డాక్టర్ అని చెప్పారు. భారత్‌లో పుట్టిన యోగాను ప్రపంచ దేశాలు గుర్తించాయని, ఇది భారతీయులు గర్వించాల్సిన విషయం అని అన్నారు. 24 గంటల కౌంట్ డౌన్ ప్రారంభమైందని ప్రజలందరి జీవితాలలో యోగా భాగం కావాలని చెప్పారు. రేపు ప్రధాని మోడి విశాకపట్నంలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. యోగాతో ప్రపంచం అంతా బాగుంటుందని అన్నారు. అది సర్వరోగ నివారిణి అని చెప్పారు.






