ఆయుర్వేదంపై ప్రజల్లో చైతన్యం పెంచాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by Ajay Maddhiboyina |

గత మూడు దశాబ్దాలుగా ఆయుర్వేదంపై ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడంతోపాటు ప్రాచీన భారత వైద్య విజ్ఞానం భవిష్యత్తు తరాలకు అందించేందుకు విశ్వ ఆయుర్వేద షరిషత్​చేస్తున్న ప్రయత్నం గొప్పదని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ప్రశంసించారు.

ఆయుర్వేదంపై ప్రజల్లో చైతన్యం పెంచాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : గత మూడు దశాబ్దాలుగా ఆయుర్వేదంపై ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడంతోపాటు ప్రాచీన భారత వైద్య విజ్ఞానం భవిష్యత్తు తరాలకు అందించేందుకు విశ్వ ఆయుర్వేద షరిషత్​చేస్తున్న ప్రయత్నం గొప్పదని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ప్రశంసించారు. శనివారం యూసుఫ్​గూడలో జరిగిన జాతీయ ఆయర్వేద సదస్సుకు ​ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆయుర్వేదం మన ప్రాచీన వైద్యవిజ్ఞానం మాత్రమే కాదని భారతీయ జీవన విధానంలో వెల్‌నెస్, ఫిజికల్​, మెంటల్ బ్యాలెన్స్ కు సంబంధించిన కంప్లీట్ ఫిలాసఫీ గా మనం చూడాలన్నారు. తాను ఆయుర్వేద వైద్యం తప్ప ఇంటర్ పూర్తయ్యే వరకు కూడా ఆలోపతి టాబ్లెట్ వేసుకొలేదు ఆయుర్వేదానికి ఉన్న గొప్పతనం అన్నారు.

ఇటీవల కాలంలో ఆయుర్వేదం కనుమరుగైందని, మోడీ ప్రధాని అయినా తర్వాత 2014 తర్వాత ఆయుర్వేదానికి ప్రాధాన్యత పెరిగింది వేల ఏళ్ల క్రితం ప్రపంచం కనీసం ఊహించలేని వైద్య విజ్ఞానం మన భారతదేశం సొంతమన్నారు. చరకుడు, సుశ్రుతుడు, వాగ్‌భట్టు వంటి ఎందరో మహానుభావులు ఈ ప్రాచీన భారత విజ్ఞానం ద్వారా నాటి సమాజానికి వైద్యం చేశారని తెలిపారు. ఇలాంటి మహనీయుల పరిశోధనల ఫలితంగానే నాటినుంచి నేటి వరకు వైద్య రంగంలో, చికిత్సా రంగంలో భారతదేశం ఉన్నతమైన స్థానంలో కొనసాగుతోందన్నారు. ఆయుర్వేదం అంటే చెట్లు, మూలికల ద్వారా మందులు ఇవ్వడం మాత్రమే కాదు. యోగా ద్వారా శారీరక, మానసిక సమతుల్యతను పంచడం కూడా ఆయుర్వేదమే అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేద పునర్వైభవం కోసం ఎంతో ప్రయత్నాలు చేస్తుందని వెల్లడించారు. కరోనా మహమ్మారి భయపెడుతున్న సమయంలో యోగా ద్వారా మనకు ఎంత భరోసా కలిగిందన్నారు. పసుపు వినియోగం పెరగడం, తిప్పతీగ ద్వారా ఇమ్యూనిటీ పెంచుకోవడం వంటివాటిని ప్రపంచవ్యాప్తంగా అనుసరించారు. ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ - 2047 లక్ష్యాల్లోనూ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఓ ప్రధానమైన మైన భూమిక పోషించనుందని చెప్పారు. నేటి యువతరానికి ఆలోచనలకు అనుగుణంగా యోగాను ఆయుర్వేదాన్ని సులభమైన పద్దతిలో ఈ ప్రపంచానికి అందించే విధంగా మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.రాజకీయాలకు సంబంధం లేకుండా యోగాను ఆయుర్వేదాన్ని మనం కాపాడుకోవాలి మన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మన పెద్దలు చెప్పిన మాట స్ఫూర్తితో మనమంతా కలిసి పనిచేద్దామని కోరారు.

Next Story