- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేదల ఆరోగ్యానికి మోడీ ప్రభుత్వం పెద్దపీట: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తోందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తోందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పుల కారణంగా మనకు తెలియకుండానే అనారోగ్యం పాలవుతున్నామని, ప్రతి వంద మందిలో 95 మంది డాక్టర్ల దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన తెలంగాణ మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ వేర్ హౌజ్ ను గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తో కలిసి ఉప్పల్పారిశ్రామిక వాడలో ప్రారంభించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ పదవి విరమణ చేసిన వారు పెన్షన్ మొత్తం వైద్య ఖర్చుల కోసమే వెచ్చించాల్సి వస్తోంది.
పేద,మధ్య తరగతి ప్రజలు కూడా అనారోగ్యం పాలైతే జీవితం మొత్తం సంపాదించిన సంపాదన వైద్యం కోసమే ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. అందు కోసం మోడీ పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యం విషయంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతి వ్యక్తికి ఏటా రూ.5 లక్షల ఉచిత బీమా అందించే ఆయుష్మాన్ భారత్ ఫథకాన్ని తీసుకొచ్చి, విజయవంతంగా ఏ ఆస్పత్రిలోనైనా చికిత్స పొందే వెసులుబాటు కల్పించారు. 70 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటీజన్లకు ఉచితంగా ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఉచిత చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో బస్తీ దవాఖానాల్లో వెల్ నెస్ సెంటర్లను ప్రవేశపెట్టాం. ఈ వ్యవస్థ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే నడిపిస్తోంది. అలాగే ఔషధాలను చాలా తక్కువ ధరకే అందించి, ప్రజల జేబులకు చిల్లులు పడకుండా ఉండేందుకు కేంద్రం జన ఔషధి కేంద్రాలను ప్రవేశపెట్టిందన్నారు.
తక్కువ ధరలకే మందులు అందిస్తాం :
సాధారణ మెడికల్ దుకాణాల్లో మందుల ధరలతో పోలిస్తే 50 నుంచి 90 శాతం వరకు తక్కువ ధరకే మందులను అందిస్తున్నామన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతో పాటు పేదలకు తక్కువ ధరలకే మందులను అందించేందుకు పెద్ద ఎత్తున జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు భారీ మొత్తంలో సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్పారు. జన ఔషధి కేంద్రాలకు సంబంధించి డిపోను తెలంగాణలో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయకుండా తత్సారం చేశారు. అలా కాకుండా రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.






