- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kishan Reddy: సీఎం రేవంత్‌వి మాటలే.. పనులు లేవు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్
మాట్లాడితే తాను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటానంటూ కామెంట్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. ఏ విషయంలో అడ్డుకున్నానో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) సవాల్ విసిరారు.

దిశ, వెబ్‌డెస్క్: మాట్లాడితే తాను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటానంటూ కామెంట్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. ఏ విషయంలో అడ్డుకున్నానో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) సవాల్ విసిరారు. ఇవాళ ఆయన హైదరాబాద్ (Hyderabad)లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం (Central Government) నుంచి వచ్చిన నిధులను మళ్లిస్తూ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెడుతోందని అన్నారు. నిరుపేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తే.. రేషన్ కార్డులపై కేంద్రం అనవాళ్లు లేకుండా చేసిందని ఫైర్ అయ్యారు.
పీఎంఏవై (PMAY) పథకం కింద ఇళ్లు మంజూరు చేస్తే.. అవి ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses)ని అందుకు రాష్ట్ర ప్రభుత్వమే నిధులు మంజూరు చేస్తుందంటూ కాంగ్రెస్ పెద్దలు చెప్పడం సిగ్గుచేటని అన్నారు. మాట్లాడితే తాను తెలంగాణ రాష్ట్ర (Telangana State) అభివృద్ధిని అడ్డుకుంటున్నానంటూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతున్నారని.. తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం (Central Government) రాష్ట్రానికి ఇప్పటి వరకు కేటాయించిన నిధులపై చర్చకు సిద్ధమా అని సీఎంను ప్రశ్నించారు. ఈ నెల 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) పార్టీకి మధ్య లోపాయకారి ఒప్పందం జరిగిందని.. ఆ రెండు పార్టీలు ఓకే తాను ముక్కలంటూ కామెంట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) ప్రచారంలో తమ పార్టీయే ముందంజలో ఉందని తెలిపారు. ఇటీవల రేవంత్ రెడ్డి పాల్గొన్న బహిరంగ సభలో ఒక్కశాతం ఓటర్లు కూడా లేరని అన్నారు. సీఎంవి మాటలే తప్ప.. పనులు లేవని, కాంగ్రెస్ కథ కంచికేనని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు.






