Kinshan Reddy: రేవంత్ రెడ్డివి బోగస్ మాటలు.. కిషన్ రెడ్డి ఫైర్

by Prasad Jukanti |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kinshan Reddy:  రేవంత్ రెడ్డివి బోగస్ మాటలు.. కిషన్ రెడ్డి ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామని అధికారపక్షం చేసిన వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి (Kishan Reddy) స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ కంటే మాకే ఎక్కువ పట్టింపు ఉందని ఉందన్నారు. శనివారం నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రయోజనాలు అని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిన్న ఢిల్లీలో ఏం మాట్లాడారో చూడాలన్నారు. హామీలు ఇచ్చి ఇప్పుడు అమలు చేయలేమని చేతులెత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదని మేము దేశ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. ఎన్నికలకు ముందు సోనియా గాంధీ సంతకాలతో ఇచ్చిన గ్యారెంటీలకు ఇప్పటి వరకు అతీగతీ లేదు కానీ మేము చెప్పని ప్రాజెక్టులు మమ్మల్నీ చేయాలంటే దానికి మేమెలా బాధ్యులం అవుతామని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మీరు ఏ ప్రాతిపదికన గ్యారెంటీలు ఇచ్చారో వాటిని పూర్తిచేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ప్రొడక్షన్ ప్రారంభం కాబోతుంటే ఇప్పుడు కోచ్ ఫ్యాక్టరీ కావాలని అడుగుతున్నారు. కనీసం అక్కడికి వెళ్లి చూసి రావాలి. కావాలంటే కాంగ్రెస్ మంత్రులకు వందేభారత్ ట్రైన్ లో నేనే తీసుకెళ్లి జరుగుతున్న కోచ్ ఫ్యాక్టరీ పనులు చూయిస్తానన్నారు.

రేవంత్ రెడ్డివి బోగస్ మాటలు:

డీలిమిటేషన్ (Delimitation) వల్ల దక్షిణభారతదేశంలోగానీ, తెలంగాణలో గానీ ఒక్క ఎంపీ సీటు తగ్గదన్నారు. ఈ విషయాన్ని ప్రధానే లోక్ సభలో స్పష్టంగా చెప్పారన్నారు. స్టాలిన్, రేవంత్ రెడ్డివి అన్ని బోగస్ మాటలన్నారు. త్వరలో తమిళనాడులో ఎన్నికలు జరగబోయేతున్నాయని అందువల్ల చెప్పుకోవడానికి ఏమీ లేక మాపై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ, దక్షిణభారతదేశంలో ఏ ఒక్క వ్యక్తిని హిందీ నేర్చుకోవాలని బలవంతం చేశామా అని ప్రశ్నించారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మాతృభాషలకు ప్రాధాన్యత ఇచ్చింది మోడీ ప్రభుత్వం అన్నారు. రేవంత్ రెడ్డి, స్టాలిన్ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదన్నారు. త్రిభాష సిద్ధాంతం మేమేమి కొత్తగా తేలేదు. కాంగ్రెస్ ప్రభుత్వమే తెచ్చిందన్నారు. కొత్తగా మేమేం చట్టం తేలేదు. జనగణన తర్వాత రీఆర్గనైజేషన్ కమిటీ వేశాక అందులో మార్గదర్శకాలు వస్తాయి. వాటిపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఒక్కనిమిషం కూడా చర్చ జరగలేదు. కానీ ఎన్నికలకు ముందు వీళ్లకు రాత్రికి రాత్రే కలపడ్డదా? ఇంత దివాలకోరు రాజకీయాలు దేశానికి మంచిది కాదన్నారు. డీలిమిటేషన్ పై ప్రధాని, హోం మంత్రి ఇంత స్పష్టత ఇచ్చినా మేము ముఖ్యమంత్రుల మీటింగ్ పెట్టుకుంటామంటున్నారు. మీటింగ్ పెట్టుకుని కాఫీలు, టీ లు తాగండి.

Next Story