- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో మరోసారి కిడ్నాపర్ల ముఠా కలకలం
హైదరాబాద్‌లో మరోసారి కిడ్నాపర్ల ముఠా కలకలం రేపింది. బాలాపూర్‌లో ఇద్దరు వ్యక్తులు చిన్నారులను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. డబ్బులు ఇస్తామని చెప్పి తమ వెంట తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో మరోసారి కిడ్నాపర్ల ముఠా కలకలం రేపింది. బాలాపూర్‌లో ఇద్దరు వ్యక్తులు చిన్నారులను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. డబ్బులు ఇస్తామని చెప్పి తమ వెంట తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. చిన్నారులు వెళ్లడానికి నిరాకరించడంతో వారిని దుర్భాషలాడారు. స్థానికులు గమనించి చిన్నారులను రక్షించి కిడ్నాపర్లను చితకబాదారు. అనంతరం కిడ్నాపర్లను పోలీసులకు అప్పగించారు. స్థానికుల కొట్టినదెబ్బలకు కిడ్నాపర్లకు తీవ్రగాయాలు అయినట్టు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇదిలా ఉంటే ఇటీవల హైదరాబాద్‌లో కిడ్నాప్ గ్యాంగ్ లు సంచరించడం ఆందోళన కలిగించిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిద్రిస్తున్న బాబును ఓ కిడ్నాపర్ ఎత్తుకువెళ్లాడు. దాదాపు 20 రోజుల తరవాత చిన్నారి ఆచూకీ లభించింది. తరవాత లింగంపల్లిలోనూ ఓ చిన్నారి కిడ్నాప్ కు గురైంది. పాలు తాగే చిన్నారిని దుండగులు తల్లిఒడి నుండి ఎత్తుకుపోయారు. ఇప్పుడు మరోసారి కిడ్నాపర్లు పట్టుబడటంతో నగరవాసుల్లో ఆందోళన మొదలైంది.






