- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతన్నకు కలిసిరాని ఖరీఫ్..! వర్షాభావంతో భారీగా తగ్గిన సాగు
ఈ ఏడాది ఖరీఫ్ నిరాశే మిగిల్చింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ ఏడాది ఖరీఫ్ నిరాశే మిగిల్చింది. రాష్ట్రంలో ఈ ఏడాది గతేడాది కంటే తక్కువ సాగైనట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. వానలు సకాలంలో కురవకపోవడంతో బోరు బావులు, చెరువులు ఉన్నచోటనే ఎక్కువగా సాగుచేశారు. కొద్దిపాటి వర్షాలు కురిసిన చోట మాత్రమే పత్తి, మొక్కజొన్న, పెసలు, మిర్చి, సోయాబీన్, కంది పంటలు మాత్రమే వేశారు. ఈ వానాకాలంలో వ్యవసాయశాఖ 1.32 లక్షల ఎకరాలకు సాగవుతుందని అంచనా వేయగా అందులో ఇప్పటివరకు 44.10 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు వేసినట్లు గుర్తించారు. గతేడాది వానాకాలంలో 46.95 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా, రెండు సీజన్ల పంటలను పోలిస్తే 2.85 లక్షలు తక్కువగా సాగైనట్లు తెలిసింది. ఈ ఏడాది జూన్లో 138 మి.మీ. వర్షపాత నమోదుకాగా, గతేడాదిలో170 మి.మీ. వర్షం పడి పంటలు సాగుచేసేలా చేసింది. ఈసారి ఆశించిన స్థాయిలో వరుణుడు కరుణించకపోవడంతో చాలామంది రైతులు వానల కోసం ఇంకా ఎదురుచూపులు తప్పడం లేదు. ఇప్పటివరకు సాగుచేసిన పత్తి, మిర్చి, కంది పంటలు బతకడం కష్టమేనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి రైతులకు కాలం కలిసి రావడం లేదని అగ్రికల్చర్యూనివర్శిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
రైతులు పంట సాగుచేసిన వివరాలు
గతేడాది పత్తి 33.10 ఎకరాలు సాగుచేయగా ఈసారి 31.25 లక్షల ఎకరాలు వేశారు. పెసలు 32వేల ఎకరాల్లో వేయగా ఈసారి 27,123 ఎకరాలు, వరి 1.57 లక్షలు వేయగా, ఈసారి 2.15 లక్షలు ఎకరాలు సాగుచేశారు. మొక్కజొన్న 2.48 లక్షలు, కందులు 2.72 లక్షలు, సోయాబీన్2.65 లక్షలు, చెరుకు 15,100 ఎకరాల్లో రైతులు వేసినట్లు జూన్లో వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. జులైలో కురిసిన వానలకు మరో 1.2 లక్షల వరకు సాగుచేసే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు భావిస్తున్నారు. వానలు ఎప్పడు కురుస్తాయో తెలియని పరిస్థితి ఉందని దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులు చినుకులు పడగానే విత్తనాలు వేస్తున్నారని చెప్పారు. ఆగస్టు నెల చివరి నాటికి కోటి వరకు పంటలు సాగుచేసే వాతావరణ ఉంటుందని అంచనాలు వేస్తున్నారు.
పంట బీమా సౌకర్యం కల్పించాలి
ఇప్పటివరకు వేసి పంటలు మరో వారం పదిరోజుల వరకు వానలు పడకపోతే ఎండిపోతాయని, పంట బీమా ఉంటే ఎంతోకొంతో పరిహారం లభిస్తుందని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. ప్రకృత్తి విపత్తులను రక్షించేందుకు బీమా ఎంతో ఉపశమనం కలిగిస్తోందని, వెంటనే రాష్ట్రం బీమా కంపెనీలతో సంప్రదింపులు జరిపి ప్రీమియం తొందరగా చెల్లించాలని కోరుతున్నారు. ఇప్పటికే లక్షల రూపాయలు అప్పలు తెచ్చి పంటలు వేశారని, వానలు పడక ఎండిపోతే రైతుకు ఊరి తాడే దిక్కుఅవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.






