నేడు అహ్మదాబాద్‌కు ఖర్గే, రాహుల్‌గాంధీ

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-14 16:08:03  IST  )

కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు ఖ‌ర్గే నేడు అహ్మ‌దాబాద్‌‌లో పర్యటించనున్నారు. విమాన ప్రమాదస్థలాన్ని పరిశీలించడంతో పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామార్శించేందుకు ఖర్గే,

నేడు అహ్మదాబాద్‌కు ఖర్గే, రాహుల్‌గాంధీ
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు ఖ‌ర్గే నేడు అహ్మ‌దాబాద్‌‌లో పర్యటించనున్నారు. విమాన ప్రమాదస్థలాన్ని పరిశీలించడంతో పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామార్శించేందుకు ఖర్గే, రాహుల్ అహ్మదాబాద్‌‌కు విచ్చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ ప్రమాద స్థలాన్ని పరిశీలించి, బాధితులను పరామర్శించిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశంలోనే తీవ్రమైన ఘటనల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ ఘటనలో విమానంలోని 241 మంది మరణించగా కేవలం ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎయిర్ ఇండియా విమానం మెడికల్ కాలేజీపై కూలడంతో లంచ్ చేస్తున్న కొందరు మెడికల్ విద్యార్థులు, సిబ్బంది సైతం కన్నుమూశారు. దీంతో ఈ ప్రమాదంలో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 274కు చేరుకుంది.

Next Story