CM రేవంత్‌ను అభినందించిన ఖర్గే, ప్రియాంక

by Gantepaka Srikanth |

CM రేవంత్‌ను అభినందించిన ఖర్గే, ప్రియాంక

CM రేవంత్‌ను అభినందించిన ఖర్గే, ప్రియాంక
X

దిశ, వెబ్‌డెస్క్: “తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌”ను ఆవిష్కరించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అభినందించారు. రాష్ట్ర భవిష్యత్ దిశను స్పష్టంగా ప్రతిబింబించే విధంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించబడిందని వారు ప్రశంసించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఖర్గే, ప్రియాంక గాంధీలను వారి నివాసాలలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌ను విజయవంతంగా నిర్వహించిన తీరు, సమిట్‌లో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించే దిశగా కుదిరిన ఒప్పందాలపై చర్చ సాగింది. సీఎం చేసిన కృషిని ఇద్దరు అగ్రనేతలు అభినందించారు.

ముఖ్యమంత్రితో పాటు మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీలు సురేష్ షెట్కార్, మందాడి అనిల్ కుమార్, పోరిక బలరాం నాయక్, డాక్టర్ మల్లు రవి, కుందూరు రఘువీర్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు.

Next Story