- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కట్టెతో ఒక్కటి వేద్దామనుకున్నా..ఏఐఎస్ఐపై తీరుపై బాధిత రైతు ఆగ్రహం
నిర్మల్ జిల్లాలో ఎమ్మార్వో ఆఫీసులో తన భూమి సమస్య కోసం వెళ్లిన ఓ వృద్ధ రైతుపై ఏఎస్ఐ కనికరం లేకుండా వ్యవహరించిన సంగతి తెలిసిందే. భూ సమస్య గురించి

దిశ, వెబ్ డెస్క్: నిర్మల్ జిల్లాలో ఎమ్మార్వో ఆఫీసులో తన భూమి సమస్య కోసం వెళ్లిన ఓ వృద్ధ రైతుపై ఏఎస్ఐ కనికరం లేకుండా వ్యవహరించిన సంగతి తెలిసిందే. భూ సమస్య గురించి ఎమ్మార్వోతో మాట్లాడుతుంటే రైతును ఏఎస్ఐ ఈడ్చుకెళ్లి బయటకు నెట్టేశాడు. ఈ ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ అయ్యింది. ఇప్పటికే ఏఎస్ఐ రాంచందర్‌ను సస్పెండ్ చేశారు. కాగా ఈ ఘటనపై రైతు స్పందించారు. ఎమ్మార్వో ఆఫీసులో మాట్లాడుతున్న సమయంలో తనను పోలీస్ గుంజుకొని వెళ్లి బైట పడేశాడని చెప్పారు.
తన వయసు 90ఏళ్లు అని ఇంత ఘోరంగా చేయడం అవసరమా అని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఏమీ చేయలేదని ఎమ్మార్వోతో మాట్లాడి వెనక్కి వస్తుంటే పోలీస్ తనను గట్టిగా పట్టుకుని లాగాడని అన్నారు. కట్టెపట్టుకుని ఒక్కటి వేద్దామని అనుకున్నానని కానీ అక్కడ ఉన్నవాళ్లంతా వద్దని అనడంతో ఆగిపోయానని చెప్పారు. తన భూమిలో నుండి అర ఎకరం భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్నారని చెప్పారు. తనను ఆఫీసులో అధికారులు ఏం అనగలేదని కేవలం పోలీసులు మాత్రమే బయటకు పంపించేశారని ఆవేదన వ్యక్తం చేశారు.






