సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్ర‌సీ అభ్య‌ర్థుల‌ను గెలిపించండి

by Nallavelli.Anjaneyulu |

దిశ, టేకులపల్లి : సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ టేకులపల్లి మండలంలో బద్ధతండ బేతంపూడి రామచంద్రుని

సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్ర‌సీ అభ్య‌ర్థుల‌ను గెలిపించండి
X

దిశ, టేకులపల్లి : సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ టేకులపల్లి మండలంలో బద్ధతండ బేతంపూడి రామచంద్రుని పేట కొప్పురాయి గ్రామపంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులకు మండలంలో 13 వార్డు మెంబర్లకు పోటీ చేస్తున్నట్లు సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ నాయకులు స్వాగత్ జిల్లా నాయకులు కల్తీ వెంకటేశ్వర్లు డి ప్రసాద్ తెలిపారు. ఆదివారం బోడు గ్రామంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రామచంద్రుని పేట సూరే సుశీల, కొప్పురాయి కుంజ రాజు, బోడు కుంజ పావని, బద్దూతండా భూక్య హర్జా, బేతంపూడి ధరావత్ హస్లీ పోటీ చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా మండలంలో 13మంది వార్డు మెంబర్లుగా పోటీలో ఉన్నారని వీరిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. ఎన్నికలు గిరిజనుల మధ్య,కుటుంబ సభ్యుల మధ్యనే జరుగుతున్నాయని స్వేచ్ఛగా ప్రజాస్వామ్యక పద్ధతులలో జరుపుకోవాలని వివిధ పార్టీల స్వతంత్ర పోటీదారులను కోరుతున్నాం. ఎలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికార పార్టీదనీ పోలీస్ అధికారులదని అన్నారు.

స్థానిక ఎన్నికలను కూడా లిక్కర్ వ్యాపారంగా .తప్పుడు పద్ధతులలో గెలవడానికి అధికార,ప్రతిపక్ష పార్టీలు పోటీ పడుతున్నాయనీ .డబ్బు మందు విందులతో స్థానిక ఎన్నికలను కలుషితం చేయడానికి బూర్జవ పార్టీలు ఉరకలేస్తున్నాయనీ అన్నారు. సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ పోడు భూములను సాధించి పెట్టింది. అన్నలు, గన్నులు పట్టిన తర్వాత భూములు, బువ్వ, తల్లి తండ్రులకు వచ్చాయనీ పిల్లలకు బడులు, పెన్నులు వచ్చాయనీ విజ్ఞానం పెరిగిందనీ సామాజిక చైతన్యం కలిగించిన పార్టీ సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ అని వారు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భూములు గుంజుకుందని. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలను అమలు చేయడం లేదనీ ఈ రెండు పార్టీలు కార్పొరేట్ల వ్యాపారస్తులకు లొంగి ఉన్నవే అని వారు అన్నారు. సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ అభ్యర్థులను గెలిపించడం వల్ల‌ బోడును మండల కేంద్రంగా ఏర్పాటు కు కృషి చేయడం కోసం పోరాడుతామని, విధ్వంసకర ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులను వ్యతిరకంగా పోరాడుతామని, దరఖాస్తు చేసుకున్న పోడు భూములన్నిటికీ పట్టాలు సాధించేంతవరకు పోరాడుతామని అన్నారు. మొక్కజొన్నకు క్వింటాకు రూ. 2400, పత్తికి రూ..8100 క్వింటాకు, వరికి 3000 మద్దతు ధర చెల్లిచాలనీ,గ్రామాల అభివృద్ధికి నిధులు సాధించుకోవాలి. పీసా ఇతర గిరిజన చట్టాల అమలుకు కోసం పోరాడతామని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎట్టి నరసింహారావు, నోముల భాను చందర్, భూక్య నర్సింగ్, ధరావత్ వెంకన్న ,కుంజ నరేందర్, కాళ్ల రంజిత్, పూణెం మహేశ్వరి, సమత పాల్గొన్నారు.

Next Story