- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ నిర్మాణాలు అడ్డుకునేదెవరు?
తల్లాడ మండల పరిధిలోని తల్లాడ కొత్తగూడెం వెళ్లే రోడ్‌లో గల సప్తగిరి వెంచర్ కు ఫైనల్ లే అవుట్ అప్రూవల్ రాకుండా టీజీరేరా, టీఎల్‌పీ నెంబర్ వచ్చిందంటూ బిల్డింగ్ నిర్మాణాలు చేపడుతున్నారు.

దిశ,తల్లాడ: తల్లాడ మండల పరిధిలోని తల్లాడ కొత్తగూడెం వెళ్లే రోడ్‌లో గల సప్తగిరి వెంచర్ కు ఫైనల్ లే అవుట్ అప్రూవల్ రాకుండా టీజీరేరా, టీఎల్‌పీ నెంబర్ వచ్చిందంటూ బిల్డింగ్ నిర్మాణాలు చేపడుతున్నారు. సప్తగిరి వెంచర్లో 58, 59, 60, 61నెంబర్ గల నాలుగు ప్లాట్లలో ఏకంగా రెండు బిల్డింగ్ నిర్మాణం పూర్తి కావచ్చాయి. ఇక్కడ అక్రమ బిల్డింగ్ నిర్మాణం దాదాపు ఐదు నెలలు నుంచి జరుగుతున్నది. పంచాయతీ అధికారులు తెలుసుకుని ఈఓ కృష్ణారావు 2025వ డిసెంబర్ 22వ తేదీన నోటీసులు ఇచ్చి, బిల్డింగ్ నిర్మాణం నిలిపివేయాలని ఆదేశించారు. రెండోసారి జనవరి 21న బిల్లింగ్ వద్దకు వెళ్లి నిర్వాహకులకు కట్టడం నిలిపివేయాల్సిందిగా ఆదేశించారు. అవేమీ పట్టించుకోకుండా నిర్మాణం చేపట్టడం, అలాగే డీటీసీపీ ఫైనల్ పర్మిషన్ లేకుండా రెండు అంతస్తుల బిల్డింగ్ నిర్మించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెంచర్ నిర్వాహకులను అడగగా డీటీసీపీ ఫైనల్ పర్మిషన్ రాకపోయినా టీజీ రేరా పర్మిషన్ ఉంటే నిర్మాణం చేపట్టొచ్చని, రేరా డాక్యుమెంట్ చూపిస్తూ నిర్మాణం చేపడుతున్నారు.
నిబంధనలు ఇలా..
తెలంగాణ మున్సిపాల్ చట్టం ప్రకారం 2019, బీపాస్ -2020 ప్రకారం టెంటేటివ్ అప్రూవల్‌తో వెంచర్లో అభివృద్ధి పనులు చేపట్టవచ్చు. ఫైనల్ లేఅవుట్ అప్రూవల్ రాకుండా ఇలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. అలా చేపట్టే నిర్మాణాలకు ఆయా సంస్థలు అనుమతులు జారీ చేయకూడదు. టెంటేటివ్ లే అవుట్ అనుమతులు పొందిన వెంచర్ నిర్వాకులు అందులో ప్రజల సౌకర్యార్థం రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యం, తాగునీటి వసతి , పార్క్ పనులు చేపట్టాల్సి ఉంటుంది. అవన్నీ పూర్తయ్యే వరకు తామే బాధితులు అంటూ వెంచర్ స్థలం విస్తీర్ణంలో 15శాతం భూమిని గ్రామపంచాయతీ పేరిట మార్ట్‌గేజ్ చేయాల్సి ఉంటుంది. నిబంధనల మేరకు ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారంటూ పంచాయతీ అధికారులు నిర్ధారించుకున్న తర్వాత మార్ట్ గేజ్ స్థలాన్ని రిలీజ్ చేస్తారు. అప్పుడే వెంచర్లో భవన నిర్మాణాలు చేపట్టేందుకు పంచాయతీ అనుమతులు లభిస్తాయి. అప్పుడే వెంచర్లో భవన నిర్మాణాలు చేపట్టేందుకు పంచాయతీ అనుమతులు లభిస్తాయి. ఈ విషయం టెంటేటివ్ లే అవుట్ అనుమతి పత్రంలో స్పష్టంగా ఉంటుంది. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే టెంటేటివ్ లే అవుట్ అనుమతులు కూడా రద్దు అవుతాయి.
రెండు సార్లు నోటీసులు ఇచ్చాం
ఈఓ, కృష్ణారావు
గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి పర్మిషన్ లేకుండా బిల్డింగ్ నిర్మిస్తున్నారని మా దృష్టికి వచ్చింది. నిర్మాణాలు ఆపాలంటూ రెండుసార్లు ఆదేశాలు ఇచ్చాం. నోటీసులు ఇచ్చినా బిల్డింగ్ నిర్మాణం పూర్తికావొస్తోందని ప్రశ్నించగా మీరు చెబితే బిల్డింగ్ కూల్చి వేద్దామని సమాధానం ఇచ్చారు.
సప్తగిరి వెంచర్‌కు ఫైనల్ డీటీసీపీ పర్మిషన్ ఇవ్వలేదు
ప్రసాద్, డీటీసీపీ అధికారి
సప్తగిరి వెంచర్‌కు తాత్కాలిక డీటీసీపీ అనుమతులు మాత్రమే ఇచ్చాం. ఫైనల్ డీటీసీపీ అనుమతులు ఇవ్వలేదు. డీటీసీపీ ఫైనల్ పర్మిషన్ లేకుండా, గ్రామపంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకోకుండా బిల్డింగ్ నిర్మాణం చేపట్టినట్లు మా దృష్టికి రాలేదు. పంచాయతీ కార్యదర్శి ఎందుకు చర్యలు తీసుకోలేదని వివరాలు కోరుతాం. వెంచర్‌లో అనుమతి లేకుండా నిర్మిస్తున్న కట్టడాలు కూల్చివేయాలని పంచాయతీ కార్యదర్శికి సూచిస్తాం.






