- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శభాష్ ఎన్పీడీసీఎల్ ఉద్యోగులు.. రాత్రికి రాత్రే జడివానలో విద్యుత్ పునరుద్ధరణ
భారీ వర్షాల్లో కూడా తమ ప్రాణాన్ని పణంగా పెట్టి పనిచేసే వారు ఎవరైనా ఉన్నారంటే విద్యుత్ శాఖ సిబ్బంది.

దిశ, ఖమ్మం : భారీ వర్షాల్లో కూడా తమ ప్రాణాన్ని పణంగా పెట్టి పనిచేసే వారు ఎవరైనా ఉన్నారంటే విద్యుత్ శాఖ సిబ్బంది. వారికి ఎండ.. వాన.. అనే తేడా లేకుండా విధుల్లో ఉంటూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా నిరంతరం పని చేస్తుంటారు. ఖమ్మం డివిజన్ పరిధిలోని అర్బన్ సెక్షన్ లో టేకులపల్లి లోని డబుల్ బెడ్ రూం ప్రాంతంలో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఓ వ్యక్తి ఇన్నోవా కారు ను నడుపుతున్న సమయంలోనే అదుపుతప్పి ఎదురుగా ఉన్న స్తంభాన్ని ఢీ కొట్టాడు.దీంతో రెండు స్తంభాలు విరిగిపోవడం తో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
వెంటనే స్థానికులు అర్బన్ ఏఈ కు సమాచారం ఇవ్వడంతో వెంటనే సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఒక్క పక్క వర్షం... మరో పక్క టేకులపల్లి లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జడివాన లో వెంటనే సిబ్బందితో విరిగిపోయిన స్తంభాలు, వైర్లు మార్చి రెండు గంటల్లో విద్యుత్ సరఫరాను అందించారు. సెక్షన్ లో ఉన్న సిబ్బంది అందరూ రెండు గంటలు కష్టపడి విద్యుత్ సరఫరాను అందజేయడం తో స్థానికులు ఎన్పీడీసీఎల్ ఉద్యోగస్తులను అభినందించారు. విధుల్లో ఏఈ నాగేశ్వరరావు, లైన్మెన్ దువ్వా రాంబాబు, లైన్ ఇన్స్పెక్టర్ ఆనందరావు, అసిస్టెంట్ లైన్మెన్ మాధవరావు, మోహన్, సిబ్బంది రవి, ఈఆర్టీ టీం తదితరులు ఉన్నారు.






